దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు

0
314

*ప్రచురణార్థం*

02.04.26

 

*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*

 

*యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*

 

 *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*

 

 *సానుకూలంగా స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ* 

 

*న్యూఢిల్లీ/ విజయవాడ* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభ లో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. 

 

యువనేత, రాష్ట్ర విద్య - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.

 

 ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు 

 

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు. 

 

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. 

 

దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 285
Andhra Pradesh
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు  15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:10:49 0 227
Andhra Pradesh
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-05 13:42:52 0 235
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com