Bharat Aawaz

పారాక్వాట్ గడ్డిమందు నిషేధం

Bheeshman King
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
1.3K
Views

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం తెలియజేయబడుచున్నది.ఈ నిషేధం 31 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చినది.పారాక్వాట్ అధిక విషతత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకోబడినది.రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టబడినవి.

నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది.డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలెను. ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తీసుకోబడును.రైతులు సురక్షిత ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతులను అనుసరించవలెను.