విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు

0
197

అమరావతి- 31-03-2026 మంగళవారం - విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై ముస్లిం యువకులను అరెస్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ దుర్గారావు గారిని మైనారిటీ నాయకులు కలిసి, ఈ ఉగ్ర లింకులో ఉన్న యువకులు ఎటువంటి వారు ఎందుకు ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారు, వారు తెలిసి చేసి ఉంటారా? లేక తెలియక ఏవైనా తప్పులు చేసి ఉండవచ్చా? లేదా నిజంగానే వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే విషయాలపై చర్చించడం జరిగింది. అదే విధంగా ఇటువంటి వారి వల్ల మొత్తం ముస్లిం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా యువతకు ఏ విధంగా అవగాహన కలిగించాలి అనే అంశాలపై చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన ఎసిపి గారు భవిష్యత్తులో ఎటువంటివి పునరావృతం కాకుండా మైనార్టీ నాయకులతో కలిసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అబ్దుల్ మతిన్ గారు, ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముక్తార్ అలీ, మైనార్టీ నాయకులు వాజిద్ ఖాన్, జమీయతే అహలే హదీస్ నగర అధ్యక్షులు నసీర్ ఉమ్రి గారు, షాహి మస్జిద్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ వహాబ్ గారు, మహమ్మద్ రిజ్వాన్ ఉల్లాహ్ ఖురేషి గారు తదితరులు పాల్గొన్నారు. త్వరలో విజయవాడ నగర గల కమీషనర్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోత
పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని...
By Krishna Balina 2026-02-10 07:28:15 0 980
Andhra Pradesh
స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
By Pagadala Venkateswar 2026-09-07 10:44:09 0 132
Telangana
కంటోన్మెంట్ : ప్రతిభకు ఎమ్మెల్యే ప్రోత్సాహం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో ఇటీవల జరిగిన...
By Sidhu Maroju 2026-06-24 08:43:25 0 129
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్...
By Pagadala Venkateswar 2026-07-11 04:07:35 0 124
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com