ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
240

ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు, టిడ్కో ఎస్‌సి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, బిజెపి అసెంబ్లీ మాజీ కో కన్వీనర్, స్థానిక బీజేపీ నేతలు,స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అపార్ట్‌మెంట్ గృహాలను ప్రారంభించారు.

మొదటి దశలో భాగంగా 1008 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ మరో ముఖ్యమైన అడుగు ముందుకు వేసిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే ఈ ప్రాంతంలో కమ్యూనిటీ షాపింగ్ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్, పాఠశాలలు, పార్కులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గారు వెల్లడించారు.

గత వైసీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమం అందించకుండా టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకుండా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించి, తరువాత కేవలం పెయింటింగ్ పనుల పేరుతో ప్రజల ధనాన్ని వృథా చేసిందని ఆయన విమర్శించారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు పట్టణంలోని 6వ వార్డు శివన్న నగర్ ప్రాంతాన్ని సందర్శించి “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-BLC) మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 650 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹2.50 లక్షల విలువైన సబ్సిడీ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణం పూర్తి చేసిన శ్రీమతి ముల్లా మెహరూన్ బీ గారి ఇంటిని ఎమ్మెల్యే గారు ప్రారంభించి, వారికి సాంప్రదాయ వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు, టిడ్కో ఎస్‌సి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ గారు ,బిజెపి నేతలు గణప వీరేష్,ఈరన్న గౌడ్, గోవిందు గౌడ్,మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-08 00:46:48 0 168
Telangana
కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ...
By Sidhu Maroju 2026-02-01 08:16:25 0 233
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్...
By Kothuru Murali 2026-05-11 05:48:21 0 136
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 260
Assam
Assam Boosts Tribal and Indigenous Welfare Programs
Assam has strengthened its focus on tribal and indigenous welfare through targeted development...
By Fathima Safa 2026-07-01 05:39:23 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com