గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి

0
261

*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*

 

*అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి పత్రం* 

 

 

ఇబ్రహీంపట్నం,

 

 కొండపల్లి ఖిల్లా పై ఉన్న హజరత్ గాలిబ్ షహీద్ దర్గా సంబంధించిన భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని వాటిని కాపాడి దర్గా అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహేలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గాకు వందల ఎకరాల భూములు ఉన్న ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 44,45,399, 401,409 లో,గొల్లపూడి 602,604 సర్వే నంబర్ లలో వందల ఎకరాలు కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయని, వాటి ద్వారా కనీస ఆదాయం దర్గాకు కానీ, ముజావర్ కుటుంబాలకు కానీ లభించడం లేదని అన్నారు. చివరికి చందాలు చేసుకుని ఉరుసు చేయాల్సిన దుస్థితి ఉంది..కానీ కొంతమంది.ముజావర్ కుటుంబాలు

పేదరికంలో సరైన ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

 

అనంతరం అల్తాఫ్ బాబా మాట్లాడుతూ దర్గా భూములను ప్రభుత్వం పిపిపి పద్ధతిలో తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి, పరిశ్రమలలో ముజావర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,

దర్గా ఉరుసు ఉత్సవాలకు ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.44, 45 సర్వే నంబర్ లలో ఐఓసీ ప్లాంట్ నిర్మాణం వక్ఫ్ బోర్డు తీర్మానం లేకుండా భూములు బలవంతంగా తీసుకున్నారని, 150 ఎకరాలు తీసుకొని ముజావర్ల కుటుంబాలకు కనీస ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, ఉరుసు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించేందుకు పోవడం దుర్మార్గమని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు వారు ఎక్విజేషన్ ని రద్దు చేసి లీజు పద్ధతి ద్వారా వచ్చే ఆదాయంతో 150 మంది ముజావర్ల జీవితాలను వారి సంక్షేమానికి దర్గా అభివృద్ధికి తోడపడుతుందని కోరారు. 2001 నుంచి ఇప్పటివరకు వడ్డీ డబ్బులు కూడా నూజివీడు కోర్టు నుండి డ్రా చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ శాఖ పట్టించుకోని చరిత్ర కలిగిన కొండపల్లి దర్గా భూములు కాపాడటమే కాకుండా హజరత్ గాలిబ్ షహీద్ షాది ఖానా,హజరత్ గాలిబ్ షాహీద్ మసీదు. హజరత్ గాలిబ్ షహీద్ మదర్సా, 150 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సయ్యద్ ఖాజాకిర్మని, సయ్యద్ గాలిబ్ షాహిద్, సయ్యద్ అహమ్మది, సయ్యద్ జబ్బార్,సయ్యద్ రెహమాన్, ముజావర్స్ కమిటీ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ  27-12-2025       *ఈ పార్క్ ప్రజలది దీన్ని...
By Rajini Kumari 2025-12-27 10:35:03 0 429
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 2K
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:05:22 0 144
SURAKSHA
Haryana Police Deploy RJSF Unit for Predictive Policing
The Haryana Police are transforming state security through data-driven technology with the...
By Lokeshwari Panthadi 2026-07-04 08:33:36 0 163
Andhra Pradesh
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామి పారువేట ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు...
By Benguluri Madhubabu 2026-02-23 04:02:12 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com