Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.

0
247

 

 

Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

20-03-2026 Fri 19:25 | Andhra

Chandrababu Naidu Reaches Tirumala with Family

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుటుంబసమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు.

 

రేపు శనివారం (మార్చి 21) నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం తరఫున ప్రతి ఏటా కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం, ఈసారి కూడా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించనున్నారు. ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా సమర్పించనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం దర్శనానంతరం తిరిగి బయలుదేరనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు.
  ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు   Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:04:59 1 261
BMA
Immersive Storytelling Shapes Future Media
Emerging technologies such as virtual reality, augmented reality, and interactive storytelling...
By JoinBMA 2026-08-20 09:49:02 0 126
Uttar Pradesh
Varanasi's Global Leap: First Major Biscuit Export to Oman
In a historic milestone for Uttar Pradesh’s food processing sector, Varanasi has...
By Lokeshwari Panthadi 2026-06-29 08:28:55 0 204
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 184
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య...
By Pagadala Venkateswar 2026-07-16 05:43:41 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com