రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి ముగింపు వేడుకలు

0
653

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు వేడుకలు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించడమే కాక, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, మద్య పాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేసి, గ్రామీన ప్రజలను చైతన్యం చేసిన తొలి మహనీయుడని కొనియాడారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ "ఆంధ్ర జాతి పిత" గా అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతివొక్కరు గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షురాలు సూరంపల్లి తేజస్వి, కార్యదర్శి జిఎవి ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పసుపుల వందనం, తడవర్తి చంద్ర శేఖర్, కేబిఎస్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, జీవిత సభ్యులు కాటి రామారావు, ఎస్ పవన్ కుమార్, ఎన్ వెంకటేష్, న్యాయవాది చేబ్రోలు రాజేశ్వరి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు నాయుడు సమావేశం
*ఢిల్లీ*    *కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో...
By Rajini Kumari 2025-12-20 14:45:53 0 252
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 382
Andhra Pradesh
మదనపల్లె బస్టాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పర్సు చోరీ.
మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం చిత్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖదీర్...
By Pagadala Venkateswar 2026-03-07 04:53:02 0 199
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 855
Telangana
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్   జైనూర్ మండలం కొమురం...
By Chunarkar Jagadeesh 2026-06-12 17:40:53 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com