ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

0
341

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజాంపేటలోని APR ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అధికారులెవరూ రోడ్డు నిర్మించలేదని చెబుతున్నప్పుడు, అక్కడ రోడ్డు ఎలా ప్రత్యక్షమైందని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

‎పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024లో ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినప్పుడే తాము కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు పొందామని తెలిపారు. అయితే, ఈ ఏడాది మార్చి 5న అధికారులు నోటీసులు ఇచ్చి, మార్చి 9న అక్రమంగా గోడను కూల్చివేసి రోడ్డు వేశారని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ తరపు న్యాయవాది.. నిబంధనల ప్రకారం లేఅవుట్ ప్లాన్‌లో ఉన్న రోడ్లను ప్రహరీ గోడలతో అడ్డుకోకూడదని వాదించారు. మరోవైపు, హైడ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తాము అక్కడ ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని స్పష్టం చేశారు.రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ ఎన్.పి. శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు హెచ్ఎండీఏ, ఇటు హైడ్రా ఇద్దరూ రోడ్డు వేయలేదని చెబుతుంటే, మరి ఆ రోడ్డును ఎవరు నిర్మించారో తేల్చాలని ఆదేశించారు. బాచుపల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీస్ స్టేషన్ల అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Tech-Driven Hiring: Inside Bihar’s Fair Police Reforms
The Bihar Police department has fundamentally transformed its hiring ecosystem by adopting an...
By Lokeshwari Panthadi 2026-07-04 10:14:25 0 259
Lakshdweep
Reforms 3.0: Roadmap to India's 8% Economic Growth Surge
Experts have unveiled an ambitious policy roadmap called "Reforms 3.0" with the aim of taking the...
By Lokeshwari Panthadi 2026-06-30 10:27:51 0 80
Rajasthan
Title Rajasthan Farmers Shift To Bajra Amid Monsoon Risks
Faced with highly unpredictable and uneven monsoon forecasts, farmers across western Rajasthan...
By Lokeshwari Panthadi 2026-06-27 06:18:33 0 148
Andhra Pradesh
బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు...
By Boiena Rajesh 2026-04-09 01:17:22 0 202
Telangana
వాంకిడిలో కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో  సంఘటన్ సృజన్ అభియాన్‌లో...
By Chunarkar Jagadeesh 2026-08-09 03:05:23 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com