సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

0
230

*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*

  ***************************

పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం (సీతారామ కోవెల) లో ఈనెల 12వ తేదీ నుండి 14 వరకు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవ మండపం, నిర్మాణం పూర్తి చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతఃకాల ఆరాధన, చతుద్వార పూజ, చతుర్థానార్చన, విశేష మంత్ర హోమాదులు, మహా పూర్ణాహుతి, సంప్రోక్షణ ప్రయుక్త మహా కుంభాభిషేకం, మహా నివేదన, వేద ఆశీర్వచన, ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద గోష్టి, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. దాతలు సూర్య దేవర సుధీర్, శ్రీమతి సుధశ్రీ దంపతులు పూజలలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీఆర్ శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ అర్చక స్వామి నంబూరి సీతారామానుజాచార్యులు, అర్చక బృందం కళ్యాణం, పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ పర్యవేక్షించారు. 

*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-15 07:41:43 0 201
Andhra Pradesh
Digging Big Wholes For What Purpose At Guntur Area ??
Digging Long Wholes For What Purpose Each And Every Road Streets Going On Same Issues !!...
By SivaNagendra Annapareddy 2025-12-14 11:48:48 0 660
Telangana
Applications invited for admissions into Gurukuls...
Applications are being accepted from students for admissions into 5th grade in Social Welfare,...
By Krishna Balina 2025-12-28 04:53:00 0 260
Andhra Pradesh
డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండి
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన...
By Vadlamudi NagaVenkat 2026-06-25 11:48:18 0 318
Andhra Pradesh
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *మ‌రో ప‌దిహేను రోజుల్లో నిర్మాణం...
By Rajini Kumari 2026-01-10 13:08:24 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com