విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ డే’ వేడుకలు

0
689

చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ డే కంటే ఈసారి విద్యార్థులు ఎంతో వినూత్నంగా తమ ప్రాజెక్టులను రూపొందించారని ప్రశంసించారు. రోబోటిక్,ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. సమాజానికి మేలు చేసే, సందేశాత్మకమైన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి.

సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం

ప్రిన్సిపాల్ కరీముల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ.. "విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు. పాఠశాల యాజమాన్యాలు వారికి చదువుతో పాటు స్పోర్ట్స్, సైన్స్ ఇతర సాంకేతిక కృత్యాలలో తగిన శిక్షణనిచ్చి ప్రోత్సహించాలి" అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

Search
Categories
Read More
Telangana
సీఎం పదవికి పాలేరు ఎమ్మెల్యే తో ముప్పుంది: నారాయణ
కరెన్సీ ప్రభుత్వాలతో తమ గెలుపును ఆపలేరని CPI జాతీయ కమిషన్ ఛైర్మన్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు....
By Krishna Balina 2026-02-10 08:00:21 0 508
SURAKSHA
Sarmad Hafeez, IAS: Driving Inclusive Governance in J&K
A distinguished 2009-batch IAS officer whose administrative excellence, legal expertise, and...
By Lokeshwari Panthadi 2026-07-22 08:21:48 0 157
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-03-16 05:45:21 0 272
Andhra Pradesh
పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం: ...
By Rajini Kumari 2025-12-27 10:47:52 0 272
Andhra Pradesh
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు *రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
By Rajini Kumari 2026-01-22 12:31:36 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com