క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు

0
191

*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*

 

*క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం – ప్రతిష్టాత్మక “ABCD” అవార్డు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు*

 

*గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. గారి చేతులమీదుగా ABCD అవార్డ్ మరియు నగదు బహుమతిను అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు*

 

రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడు నెలకు ఒకసారి ప్రకటించే "అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD)" అవార్డ్ అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్ కు గాను మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన మర్డర్ కేసును చేదించినందుకు గాను ప్రకాశం జిల్లా ప్రధమ స్ధానంలో ఎంపిక అవ్వగా శుక్రవారం డి.జి.పి ప్రధాన పోలీస్ కార్యాలయం మంగళగిరిలో గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పీ.ఎస్., గారి చేతుల మీదుగా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఐపీఎస్., గారి సమక్షంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,గారికి మరియు ఎస్పీ గారి పర్యవేక్షణలో అత్యుత్తమ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఈ అవార్డు అందజేయడం జరిగింది. రాష్ట్ర సిఐడి-డీజీపి శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ ఐ.పి.ఎస్.గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

*కేసు వివరాలు*: తేదీ 23.06.2024 న మద్దిపాడు మండలం దొడ్డవరపాడు గ్రామ పరిధిలోని కపిల్ లేఅవుట్ ప్లాట్స్ వద్ద గుర్తు తెలియని సుమారు 14 సంవత్సరాల బాలిక శవం కుళ్లిన స్థితిలో కనిపించడంతో వీఆర్వో దండేల మౌనిక ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.122/2024 u/s 174 Cr.P.C కింద కేసు నమోదు చేయటం జరిగింది. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యగా నిర్ధారణ కావడంతో కేసును u/s 302, 376(D)(A) r/w 34 IPC మరియు సెక్షన్ 6 r/w 5(g) POCSO పలు సెక్షన్ కింద మార్చటం జరిగింది.

 

జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఒంగోలు రూరల్ సీఐ ఎన్. శ్రీకాంత్ బాబు దర్యాప్తు చేపట్టి ప్రత్యేక బృందంతో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా 14.02.2025 న సింగరాయకొండలో బాలిక తల్లి మోదడుగు తిరుపతమ్మను గుర్తించి, ఫోటోలు చూపించగా ఆమె తన కూతురు గానే నిర్ధారణ చేసినది. 

 

సాంకేతిక ఆధారాలతో 1. దుద్దెల చెన్న కృష్ణ,( 26 సం), విప్పుకుంట గ్రామం, పొన్నలూరు మండలం. 2. దేవరాజు వంశీ, (26 సం), విప్పగుంట గ్రామం, పొన్నలూరు మండలం, 3. డబ్బు కొట్టు కోటయ్య (28 సం), విప్పగుంట గ్రామం, పొన్నలూరు మండలం, ప్రస్తుతం గోపాల్ నగర్, సింగరాయకొండ అనే ముగ్గురు నిందితులను గుర్తించి, వారు వివిధ జిల్లాల్లో తలదాచుకొని ఉండగా గాలింపు నిర్వహించి 30.12.2025 న అదుపులోకి తీసుకోవటం జరిగింది. విచారణలో వారు బాలికను కపిల్ లేఅవుట్ ప్లాట్స్ వద్దకు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసి, విషయం బయటపడుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు.

 

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు, గతంలో ఒంగోలు రూరల్ ఇన్స్పెక్టర్ యన్.శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్సై జి.వెంకటసూర్య, మద్దిపాడు హెడ్ కానిస్టేబుల్ వి.హనుమంతరావు(HC.1908),ఆర్.కృపానంద కుమార్(HC.531), కానిస్టేబుల్ SK.కరీమ్(PC.1130), సంతనూతలపాడు హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ ఖాజా హుస్సేన్ (HC.598), కానిస్టేబుల్ యం.జాన్ వెస్లీ(PC.968), ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు(PC-2661)ఈ అవార్డు మరియు నగదు బహుమతిను అందుకున్నారు.

 

ఇలాంటి కేసులను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై గౌరవం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ గారు అన్నారు. ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకొని, జిల్లా పోలీసులు భవిష్యత్తులో కూడా మరిన్ని కేసులను సమిష్టిగా, సమర్థవంతంగా ఛేదించాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనపరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతీ మూన్నెళ్లకు ఒకసారి ప్రకటించే ఏబిసిడి ( అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్ ) అవార్డు జిల్లాకు దక్కడం... అందునా గౌరవ రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

 

జిల్లా పోలీసు శాఖ సాధించిన ఈ ఘనత మరింత బాధ్యతతో ప్రజల భద్రత కోసం పనిచేయడానికి ప్రేరణగా నిలవాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 261
Andhra Pradesh
ఎక్సైజ్ కేసుల్లో వాహనాల వేలం: ప్రభుత్వానికి రూ.3.74 లక్షల ఆదాయం
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన 33 ద్విచక్ర వాహనాలకు గాను 25 వాహనాలను...
By Kothuru Murali 2026-06-20 16:12:17 0 113
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో...
By Kothuru Murali 2026-02-19 10:01:55 0 221
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com