ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి

0
176

*ప్రెస్ నోటు*

*తేదీ : 13-3-2026,శుక్రవారం*

*విజయవాడ, కలెక్టరేట్*

 

*హోటల్ రంగానికి గ్యాస్ కొరతను నివారించాలి – బ్లాక్ మార్కెట్ అమ్మకాలను అరికట్టాలి. హోటల్ వర్కర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలి. వారి జీవనోపాధి కాపాడాలి.*

 

*ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నిరసన*

 

*అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. మరియు నగరంలో మూతపడిన గుడ్ మార్నింగ్ హోటల్ వర్కర్స్ తో మాట్లాడడం జరిగింది. గ్యాస్ కొరత వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం మమ్మల్ని ఆడుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.*

 

*ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు మాట్లాడుతూ*

 

📍విజయవాడ నగరంలో హోటల్ రంగానికి అవసరమైన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందినీ అన్నారు.ఈకారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్ల నిర్వహణ చాలా కష్టంగా మారిందినీ గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల అనేక హోటళ్లలో వంట కార్యకలాపాలు అంతరాయం కలుగుతున్నాయిని. దీనివల్ల హోటల్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోందిని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కోరారు.

 

📍ఇక మరోవైపు కొంతమంది వ్యాపారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిని అన్నారు. ఇది హోటల్ యాజమాన్యాలకు మరింత భారం అవుతోందిని తెలిపారు. ప్రభుత్వము వెంటనే దీనిపై దృష్టి సారించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే బ్లాక్ మార్కెట్ గ్యాస్ అమ్మకాలను కట్టడి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కమర్షియల్ గ్యాస్ బండ 3 వేలకు పైగా అమ్ముతున్నారని తెలిపారు.

 

*సిఐటియు నగర కార్యదర్శి ఎం.సోమేశ్వరావు, విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.వి. రమణ మాట్లాడుతూ*

 

గ్యాస్ కొరత సమస్య వల్ల నగరంలో చాలా హోటల్స్ మూతబడుతున్నాయని దీనివల్ల హోటల్ వర్కర్స్ కే కాకుండా సాధారణమైన ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తక్షణమే హోటల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించి హోటల్ రంగాన్ని, ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిని కాపాడాలని విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (CITU) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందిని అన్నారు.సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోకపోతే యూనియన్ ఆధ్వర్యంలో అందరిని కలుపుకొని ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

*ఈ కార్యక్రమంలో విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (CITU) నగర నాయకులు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Telangana
"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|
సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే...
By Sidhu Maroju 2026-04-10 06:24:45 0 340
Telangana
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత...
By Prashanth Goindla 2025-12-26 05:09:18 0 410
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలివే
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో...
By Boiena Rajesh 2026-08-23 11:23:53 0 83
Telangana
SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై...
By Sidhu Maroju 2026-07-16 10:09:20 0 243
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 861
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com