ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శా

0
238

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 13, 2026*

 

*మొల్ల‌మాంబ జీవితం అందరికీ ఆద‌ర్శ‌నీయం..*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

తొలి తెలుగు క‌వ‌యిత్రి మొల్లమాంబ జీవితం అంద‌రికీ ఆదర్శ‌నీయ‌మ‌ని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ర‌చించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ‌మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి మొల్ల‌మాంబ చిత్రపటానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మొల్ల‌మాంబ సాహిత్య సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. మొల్ల రామాయణం నేటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన, తేట తెలుగు కావ్యాలలో ఒకటిగా నిలిచిపోయిందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, బీసీ సంక్షేమం, వివిధ శాఖ‌ల అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా...
చీరాల: చీరాల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ...
By Gadiyapudi Narendra 2026-01-20 12:30:37 0 225
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 315
Telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్:  పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన...
By Sidhu Maroju 2025-10-17 10:55:29 0 564
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 264
SURAKSHA
Operation Parivartan: AP Police's Mission for Drug-Free Society
The 'Operation Parivartan' led by the Andhra Pradesh Police is a historic initiative for tribal...
By Kalaga Sailaja 2026-06-24 06:04:39 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com