దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు

0
398

దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత నాయకులు మార్కాపురం జిల్లాలో దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసుల రిలీఫ్ ఫైల్ పరిష్కరించాలని మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులను మంగళవారం దళిత నాయకులు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో మరికొందరు దళిత నాయకులు కలసి విజ్ఞప్తి చేశారు. మార్కాపురంలోని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు నివసిస్తున్న అపార్ట్మెంట్లో కలసి దళితుల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు కమిటీ జీవోలను అమలు చేయవలసి ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో దళితుల భూములను ఇతరులు ఆక్రమించిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చిన భూములలో కూడా ఇతర కులాలవారు ఆక్రమించి అమ్ముకుంటున్నారన్నారు. మార్కాపురం జిల్లాలో ఎక్కువ అటవీ ప్రాంతం అయినప్పటికీ దళితులకు స్మశాన భూములు కూడా లేవన్నారు. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుతొ భూముల రేట్లు కు వచ్చాయన్నారు. దళితుల భూములు ఆక్రమణలు జరిగిన పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెడితే తహసిల్దార్ నుంచి రిపోర్టు వస్తేనే కేసు కడతాము అంటున్నారు. GOMS NO1235 ప్రకారం స్మశాన భూములు లేని ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ భూములైన కేటాయించాలి లేదా మార్కర్ రేటు చెల్లించి చాన భూమిని కొనివ్వాలన్నారు. మార్కాపురం జిల్లాలో దళితుల పట్టా భూములు ఆక్రమణలపై 9/77 యాక్ట్ అమలు చేసి భూములు అమ్ముకున్న ఎస్సీ ఎస్టీలకు తిరిగి భూములు ఇప్పించాలన్నారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఇతరులపై ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అలాగే బేస్తవారి పేట పోలీస్ స్టేషన్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు రోజే హత్యకు గురైన జయంపు కృష్ణయ్య కేసులో మార్కాపురం డి.ఎస్.పి కోర్టులో షార్ట్ సీటు ఫైల్ చేశారు. కావున బాధిత కుటుంబానికి ఈ ఎస్ టి యానాది కులస్తుని హత్య కేసులో బంధువులకు రిలీఫ్ ఎస్సీ ఎస్టీ మంత్లీ పెన్షన్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు రిపోర్టులు తెప్పించాలని మార్కాపురం జెసి పులి శ్రీనివాసకు హత్యకు గురైన జయంబు కృష్ణయ్య సార్ సీట్ కాపీని అందించారు. అలాగే పూర్వపు మార్కాపురం డివిజన్లో ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైన దాడులకు గురైన కలెక్టరేట్ వారికి సంబంధిత తహసిల్దార్లు రిపోర్టులు పంపకుండా అలసత్వం వహించే వారన్నారు. నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు రిలీఫ్ ఇవ్వటానికి తహసిల్దార్లు వెంటనే రిపోర్టులు పంపని తహసీల్దారులపై ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 3(2) V11 విక్కనైజేషన్ ఎట్ దా హాండ్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ప్రకారం కేసులు నమోదు చేయించాలన్నారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య , కాకుమాను రవి, పట్రా బంగారం, వీసీకే పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి రాజు తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
After Retirement: Telangana Police Fight Social Evils
Retirement తీసుకున్న Telangana Police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage...
By Kalaga Sailaja 2026-07-03 11:55:22 0 203
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 2K
Andhra Pradesh
బీసి రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర
*బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర*   - అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు, బీసీల...
By Rajini Kumari 2026-01-03 09:37:18 0 255
Andhra Pradesh
పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం...
By Kothuru Murali 2026-01-22 11:54:33 0 212
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 647
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com