అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు

0
334

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2026 హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు – 2026ను ప్రదానం చేశారు.

సంస్థ తరఫున నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, వృద్ధాశ్రమాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, తలసేమియా బాధిత పిల్లలకు రక్తం అందించడంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్ కమిషనర్ సరిత గోగుల చేతుల మీదుగా సంస్థ కన్వీనర్ తమరాన రామకృష్ణ (LIC) మరియు సంస్థ సెక్రటరీ రొంగల అర్జున్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు ప్రముఖులు మరియు సేవాభావులు సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
శామీర్ పేట ORR పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:52:41 0 293
SURAKSHA
AP పోలీసులు నేడు: విధి దాటి ప్రజా సేవలో
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు విజయవాడ శివారు ప్రాంతాల్లో మానవత్వం చాటుకున్నారు. పేద కుటుంబాలకు...
By Kalaga Sailaja 2026-07-06 05:28:40 0 105
Sports
NBA Playoffs: Cavaliers and Knicks Set to Clash in Eastern Finals
The quest for the Larry O'Brien trophy intensifies tonight as the Cleveland Cavaliers face off...
By Dunna Jessicaruth 2026-05-20 05:36:31 0 121
Andhra Pradesh
ఈ నెల 28 వరకు వర్షాలు!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన...
By Boiena Rajesh 2026-03-23 06:55:32 0 264
Andhra Pradesh
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్...
By Gadiyapudi Narendra 2025-12-30 10:50:06 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com