నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం

0
213

*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*

 

*44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి*

 

 విజయవాడ, మార్చి 9: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా మెట్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి చెప్పారు. సోమవారం నూతన పనులకు కార్పొరేటర్ రత్నకుమారి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి మార్గదర్శకత్వంలో 44 డివిజన్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తున్నట్లు ఆమె వివరించారు. 44వ డివిజన్ తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఎంపీ కేశినేని శివనాధ్, పశ్చిమ ఎమ్మెల్యే వై.సుజనా చౌదరి అహర్నిశం కృషి చేస్తున్నారని కొనియాడారు. 44వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు నిర్మాణం పనులు నిర్వహిస్తున్నామని, అలాగే అవసరమైన చోట్ల సంబంధిత పనులకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏఈ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్యూనిటీ సెక్రటరీ హర్షిత, కాంట్రాక్టర్ బత్తుల వెంకటేష్, స్థానికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి లోకేశ్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరికలు పెరిగాయి: MLA అదితి
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పర్యటనను విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే అదితి...
By Boiena Rajesh 2026-08-23 09:42:15 0 113
Andhra Pradesh
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra   Gadkari good news for Andhra Pradesh మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-02-06 04:48:14 0 226
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 250
Andhra Pradesh
చింతూరు: అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!
చింతూరు మండలం తిమ్మరిగూడెం గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణికి శనివారం అకస్మాత్తుగా ప్రసవ వేదన...
By Shyamala Yadagiri 2026-05-30 07:23:52 0 252
Goa
Goa Strengthens Fisheries and Blue Economy Growth
Goa continues to promote fisheries and the blue economy in 2026 through measures aimed at...
By Fathima Safa 2026-07-04 06:22:00 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com