YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.

0
198

Andhra

 

YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP

జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల

జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ

కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని విమర్శ

 

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. 

 

 

రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ... ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 175
Andhra Pradesh
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు....
By Pagadala Venkateswar 2026-03-07 04:49:13 0 162
Andhra Pradesh
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-10 08:52:33 0 201
Chhattisgarh
Chhattisgarh's Industrial Growth and Investment Drive
Chhattisgarh continues to strengthen its position as an emerging industrial hub through strategic...
By Fathima Safa 2026-06-24 07:45:10 0 190
Andhra Pradesh
అన్నమయ్య: 22-A భూ సమస్యలకు చెక్… రైతులకు, ప్రజలకు ఊరట!.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం 22-A భూ సమస్యలకు పరిష్కారం చూపింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల...
By Pagadala Venkateswar 2026-06-16 04:28:25 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com