‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

0
407

ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి ఆర్ పి ఎస్‌.ఐ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల సామానులను అనుమానాస్పద వ్యక్తులపై, వస్తువులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణపై అవగాహన కల్పిస్తూ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించబడింది.గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ప్రజలు కూడా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
By Pinnehasan Odela 2026-01-15 14:31:53 0 505
Telangana
కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును...
By Krishna Balina 2026-01-24 14:32:43 0 409
SURAKSHA
Ilango R., IPS: A Dedicated Leader in Public-Centric Policing
Ilango R., IPS – Serving the Nation with Integrity and Courage The Journey Begins "The...
By Fathima Safa 2026-07-10 07:25:10 0 127
BMA
Hyperlocal Data Mining: Civic Monitoring via AI
To significantly streamline complex research workflows, newsrooms are deploying AI...
By JoinBMA 2026-08-21 09:42:23 0 153
Telangana
పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హతం.|
హైదరాబాద్ : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్...
By Sidhu Maroju 2025-12-25 17:43:18 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com