*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*

0
432

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ అధికారులు, విద్యార్థినులతో కలిసి సీసీఎస్ డీఎస్పీ గారు రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, పరికరాల గురించి స్వయంగా విద్యార్థులకు వివరించారు."ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థినులతో పోలీసు అధికారులు మమేకమై మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా అవగాహన కల్పించారు. బాలబాలికలకు సంబంధించిన సమస్యలకు చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్‌లైన్: 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్‌లైన్: 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించవలసిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: 1930 గురించి వివరించారు.అదేవిధంగా విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతికత, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉపయోగిస్తున్న పరికరాల గురించి వివరించారు.అలాగే నేరస్థల పరిశీలనలో క్లూస్ టీం ఆధారాలు సేకరించడం, ఫింగర్ ప్రింట్స్ సేకరణ విధానాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశారు.ఈ సందర్భంగా సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 8వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విద్యార్థినులకు మహిళల భద్రత,పోలీసు విధులపై అవగాహన కల్పించేందుకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బాపట్ల పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించినట్లు తెలిపారు.మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారత కోసం జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారతను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడం, మహిళల గౌరవాన్ని పెంపొందించే చిత్రాలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు.ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇతర శాఖల అధికారులతో కలిసి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ బి. నారాయణ, అడ్మిన్ ఆర్‌.ఐ మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, బాపట్ల పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శివనామస్మరణతో శైవక్షేత్రం మార్మోగడానికి సిద్ధమైంది.. అది ఎక్కడో తెలుసా....*
అయితే గుండం జాతరకు పోదామా...!* *బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉండటం విశేషం* *భక్తుల కోరిన...
By Bheeshman King 2026-02-10 14:29:13 0 2K
Andhra Pradesh
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన...
By Benguluri Madhubabu 2026-05-08 12:59:24 0 271
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక...
By Kothuru Murali 2026-02-18 07:29:37 0 202
Andhra Pradesh
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…   ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
By Rajini Kumari 2026-01-22 12:05:59 0 225
Andhra Pradesh
మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.
ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు...
By Pagadala Venkateswar 2026-04-08 05:42:52 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com