Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.

0
166

 

 

Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు

05-03-2026 Thu 21:39 | Andhra

 

Chandrababu Naidu Announces 25000 Incentive for Third Child in Andhra Pradesh

మూడో బిడ్డకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన

నెలకు వెయ్యి చొప్పున పౌష్టికాహార సాయం మరియు ఉచిత విద్య

ప్రసూతి సెలవులు ఏడాదికి పెంపు మరియు తండ్రులకు రెండు నెలల సెలవు

రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన

ఏప్రిల్ 1 నుంచి నూతన జనాభా నిర్వహణ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త 'జనాభా నిర్వహణ విధానం' ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

 

ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ.. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టీఎఫ్ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా 'పాపులేషన్ కేర్' (జనాభా సంరక్షణ) విధానానికి మారుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు దశల విధానంతో ప్రజలకు అండగా ఉంటామన్నారు. పిల్లలు లేనివారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ పాలసీపై నెల రోజులు చర్చించి, మార్చి నెలాఖరుకు ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 230
Chhattisgarh
Global Tech Spotlight Shines on Bhilai
Chhattisgarh’s industrial hub, Bhilai, has transformed into a global tech stage today, May...
By Dunna Jessicaruth 2026-05-15 09:04:39 0 113
BMA
Conflict Zones: Press Defeats Information Blackouts
The press works relentlessly for citizens trapped in conflict zones, battling severe...
By JoinBMA 2026-08-20 06:57:06 0 138
Andhra Pradesh
మహిళా పరిశ్రమకు వ్యక్తుల ఎం ఓ యు
Ratan Tata Innovation Hub , ఎనికేపాడు విజయవాడ ALEAP WEKART 2026లో పాల్గొన్న RTIH – మహిళా...
By Rajini Kumari 2026-03-26 13:41:48 0 243
Andhra Pradesh
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-17 06:17:18 0 709
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com