వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
Posted 2026-03-02 13:39:09
0
325
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా జన్ సంవాద్ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని పటిష్టం చేస్తూ, పారదర్శకతతో కూడిన అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఆళ్ల విజయలక్ష్మి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కంచారం: ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాజాం మండలం కంచరాంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ ఆదివారం నిర్వహించారు. 18 యేళ్లు నిండిన...
Poonam Malakondaiah, IAS: Transforming Public Service Excellence
A Distinguished Civil Servant Driving Excellence in Healthcare, Education, Women Empowerment, and...
Ajoy Kumar Sinha: Steering Punjab with Vision and Integrity
The Journey Begins
"Strong institutions are built through visionary leadership, transparent...
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
India Approves ₹23,731 Cr GOBARdhan Biogas Scheme
The Union Cabinet has approved the ₹23,731 crore National Unified GOBARdhan Scheme to accelerate...