బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు

0
203

*ప్రచురణార్థం* *23-02-2026*

 

 

*బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తెలుగు తేజం ఎర్రన్నాయుడు* :

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జ‌యంతి కార్యక్రమం*

 

*ఎర్రన్నాయుడు చిత్ర‌ప‌టానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేత‌లు*

 

 

విజయవాడ : టిడిపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగ‌త నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి కార్య‌క్ర‌మం సోమ‌వారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో జ‌రిగింది. టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భవకుమార్ , ఏపీ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ ల‌తో పాటు టిడిపి నాయ‌కులు ఎర్రన్నాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ సంద‌ర్భంగా వ‌క్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తెలుగు తేజం ఎర్రన్నాయుడు అందరి వాడంటూ దివంగత టిడిపి నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సేవలను కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్దిమందిలో ఎర్రన్నాయుడు ఒకర‌ని పేర్కొన్నారు.. సుదీర్ఘ కాలంపాటు శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి...కేంద్ర మంత్రిగా వ్యవహరించారని , మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించారని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు తెలుగుదేశంలోనే వుండి ప్రజా సేవలోనే గడిపిన ఎర్రన్నాయుడు స్పూర్తి అందరికీ ఆదర్శమ‌న్నారు. నిత్య కృషీవలుడిగా పేరుపొందిన ఎర్రన్నాయుడ్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేస్తామన్నారు. ..

 

ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు మాదిగాని గురునాథం, యెర్నేని వేద‌వ్యాస్, పామ‌ర్తి కిషోర్ బాబు , జి.వి.న‌ర‌సింహారావు, అబీద్ హుస్సెన్, కామా వెంక‌ట న‌ర‌సింహారావు, టిడిపి మ‌హిళ నాయ‌కులు స‌య్య‌ద్ గౌసియా, నాగ‌ర‌త్నంల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్తకంఠంతో ఖండించాలి
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి    • భాష, కులం, ప్రాంతాలకు...
By Rajini Kumari 2026-02-24 16:01:42 0 209
Maharashtra
Maharashtra Strengthens Education and Skill Development
Maharashtra continues to advance education and skill development through initiatives aimed at...
By Fathima Safa 2026-06-30 11:20:18 0 72
Kerala
Kerala Advances Smart Cities and Urban Development
Kerala continues to strengthen smart city and urban development initiatives in 2026 by upgrading...
By Fathima Safa 2026-07-04 12:51:50 0 113
SURAKSHA
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...
By Kalaga Sailaja 2026-07-03 06:01:53 0 60
Telangana
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8...
By Sidhu Maroju 2026-07-29 16:21:23 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com