Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు.

0
196

Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు

21-02-2026 Sat 16:37 | Andhra

Chandrababu Condemns Congress Protest at Delhi AI Summit

ఇలాంటి పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని వ్యాఖ్య

టెక్నాలజీని ప్రజల మేలు కోసమే వినియోగిస్తామన్న ముఖ్యమంత్రి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి నిరసన తెలపడం తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ప్రపంచంలోని 60కి పైగా దేశాలు తమ ఆవిష్కరణలతో పాల్గొన్న అంతర్జాతీయ సదస్సులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఈ పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని స్వాగతించాల్సింది పోయి, ఇలాంటి నిరసనలు చేయడం దారుణమని పేర్కొన్నారు.

 

తాను ఇటీవల ఢిల్లీ ఏఐ సదస్సుకు హాజరయ్యానని, వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినూత్న మార్పులు తీసుకురాబోతోందని వివరించారు. టెక్నాలజీని ప్రజల మేలు కోసం వినియోగించడం తనకు అలవాటని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని తీసుకొచ్చి సాగును సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
*అమరావతి : 'పోలవరం-నల్లమల సాగర్' ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!* *( Mahanaadu...
By Rajini Kumari 2026-01-12 13:04:45 0 198
Andhra Pradesh
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*   *అమరావతి*   *జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...
By Rajini Kumari 2025-12-27 10:43:30 0 254
Andhra Pradesh
నియోజక వర్గంగా మధుర వాడ?
రాబోయే నియోజక వర్గాల పునర్విభజన  భాగంగా విశాఖ జిల్లాలో  మరో రెండు నియోజక వర్గాలకు...
By Mobbu Venkatramana 2026-03-28 17:23:50 0 458
Andhra Pradesh
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు పెద్దారవీడు మండలం, సుంకేసుల...
By Chennaiah Kati 2026-06-24 16:00:44 0 107
SURAKSHA
. Cyber Safety: TN Police Fights Online Fraud
 Cyber Crime Wing of Tamil Nadu Police works 24x7 to stop online fraud. They track fake loan...
By Kalaga Sailaja 2026-07-02 05:28:08 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com