నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్

0
213

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.
బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఆటో డ్రైవర్ మొగిలి రాజు తన వాహనంలో బంగారు తాళిబొట్టు కనిపించడంతో బాధ్యతగా వ్యవహరించి యజమానిని వెతికే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన ఆ తాళిబొట్టును చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించారు.
వన్‌టౌన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించి బాధితురాలిని గుర్తించారు. నేడు జంగిలి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అవసరమైన ఆధారాలు సమర్పించగా, ఆమెకు తాళిబొట్టును తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ మొగిలి రాజును, సీఐ, ఎస్, సుబ్బారావు, అభినందించారు. పరాయి సొమ్ముపై ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Andhra Pradesh
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్...
By Chennaiah Kati 2026-06-24 10:38:26 1 134
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 3K
Andhra Pradesh
DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
    ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ...
By Boya Dasthagiri 2026-03-26 09:54:06 0 344
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com