• డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు
    జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
    మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు
    మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది.
    కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు:
    నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి.
    మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి.
    అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి.
    చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి.
    ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!
    డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. 🧠 మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది. 🛡️ కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు: నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి. మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి. అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి. చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!
    0 Comments 0 Shares 183 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

    #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 459 Views 0 Reviews
  • ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

    మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

    ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు.

    కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు.

    “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు.

    మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

    గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

    శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

    గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

    ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు.

    వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.

    మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

    భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ❇️ మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ❇️ ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు. ❇️ కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు. ❇️ “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు. ❇️ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ❇️ గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ❇️ శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ❇️ గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ❇️ ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ❇️ రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. ❇️ వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ❇️ ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ❇️ మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ❇️ ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ❇️ భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    Like
    1
    3 Comments 0 Shares 2K Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కలిసిన పీఎంశ్రీ నోడల్ అధికారి.

    సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్ కుమార్ శుక్రవారం కలిసారు. పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ పరిశీలించేందుకు వచ్చి.. కలెక్టర్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మర్యాద పూర్వకంగా కలువగా, పుష్ప గుచ్చం అందజేశారు.

    ఈ సందర్భంగా పీఎంశ్రీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు, వివిధ నిర్మాణ పనులపై చర్చించారు
    సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కలిసిన పీఎంశ్రీ నోడల్ అధికారి. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్ కుమార్ శుక్రవారం కలిసారు. పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ పరిశీలించేందుకు వచ్చి.. కలెక్టర్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మర్యాద పూర్వకంగా కలువగా, పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పీఎంశ్రీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు, వివిధ నిర్మాణ పనులపై చర్చించారు
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

    • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్

    • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు

    • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్ • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    0 Comments 0 Shares 220 Views 0 Reviews
  • తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
    45 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం
    హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది.
    పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. Southern Power Distribution Company of Telangana Limited (SPDCL) సీఎండీగా జితేశ్ వి. పాటిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ నియమితులయ్యారు.
    ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ & సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
    డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం. దాన కిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు.
    జిల్లా స్థాయిలో కూడా పలువురు కలెక్టర్లను బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్ నియమితులయ్యారు. యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించనున్నారు.
    ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బి.ఎం. సంతోష్, లేబర్ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్‌గా పి.ఎస్. రాహుల్ రాజ్ నియమితులయ్యారు.
    జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ నియమితులయ్యారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
    పరిపాలన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
    తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు 45 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. Southern Power Distribution Company of Telangana Limited (SPDCL) సీఎండీగా జితేశ్ వి. పాటిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ నియమితులయ్యారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ & సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు చేపట్టనున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం. దాన కిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. జిల్లా స్థాయిలో కూడా పలువురు కలెక్టర్లను బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్ నియమితులయ్యారు. యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బి.ఎం. సంతోష్, లేబర్ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్‌గా పి.ఎస్. రాహుల్ రాజ్ నియమితులయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ నియమితులయ్యారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు. పరిపాలన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
    0 Comments 0 Shares 188 Views 0 Reviews

  • Telugu News Telangana Adilabad Collector Revises School Timings Amid Severe Cold వేవ్


    Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు
    ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర చలి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల పనివేళలను జిల్లా కలెక్టర్ మార్చారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

    Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు...

    తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.


    జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

    పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు.


    కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు.

    ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ఐఎండి (IMD) నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ముందుగానే పాఠశాలలు ప్రారంభించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయ మార్పులు అమల్లోకి వచ్చాయి.
    Telugu News Telangana Adilabad Collector Revises School Timings Amid Severe Cold వేవ్ Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర చలి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల పనివేళలను జిల్లా కలెక్టర్ మార్చారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు... తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు. కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ఐఎండి (IMD) నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ముందుగానే పాఠశాలలు ప్రారంభించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయ మార్పులు అమల్లోకి వచ్చాయి.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు
    రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
    ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.

    అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ,
    మిషన్ భగీరథ,
    మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు.

    ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.

    ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు .

    ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ...
    ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ .

    ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు.

    ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
    రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ... ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ . ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరోసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లతో కలిసి పరిశీలించారు. NDRF, SDRF చేపట్టిన సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. అనంతరం, పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనలో బాధితుల కోసం ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి న్యాయం చేస్తామనీ భరోస ను ఇచ్చారు. బాధితుల తరఫున వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
    పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరోసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లతో కలిసి పరిశీలించారు. NDRF, SDRF చేపట్టిన సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. అనంతరం, పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనలో బాధితుల కోసం ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి న్యాయం చేస్తామనీ భరోస ను ఇచ్చారు. బాధితుల తరఫున వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
    0 Comments 0 Shares 749 Views 0 Reviews
  • *సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి*

    *సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం*

    *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*

    ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

    హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు.

    సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.
    *సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి* *సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం* *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ* ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.
    0 Comments 1 Shares 12K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com