Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • 24వ వార్డులో వైసీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
    పార్వతీపురం మున్సిపాలిటీలోని 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి జమ్ము దుర్గారాణి, ఛైర్పర్సన్ అభ్యర్థి సాయిశ్రీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #RAJESH 
    57 Views
  • పార్వతీపురం జిల్లాలో 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు
    పార్వతీపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.   జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలైనట్లు...
    56 Views
  • కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు
    కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం స్ట్రాంగ్ రూం లెక్కింపు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఎన్నికల అనంతరం బాలెట్ బాక్స్ల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. DSP తదితరులు ఉన్నారు....
    58 Views
  • జిల్లాలో పెరుగుతున్న శిశు మరణాలు
    విజయనగరం జిల్లాలో శిశు మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 149 మంది శిశువులు, నలుగురు గర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో 307 శిశు మరణాలు, 10 మాతృ మరణాలు సంభవించాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. #RAJESH 
    82 Views
  • ఉదయం టీడీపీకి.. మధ్యాహ్నం జనసేనకు నామినేషన్
    బాడంగి మండలంలో ఎన్నికల విచిత్రం చోటు చేసుకుంది. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన మత్స శిరీష శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. మధ్యాహ్నం జనసేన అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. ఒకే అభ్యర్థి రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేయడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేసినట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు....
    76 Views
  • గరివిడిలో బిగ్ ఫైట్.. బొత్స వర్సెస్ కళా!
    గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. #RAJESH 
    79 Views
  • డొంగురువలస గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా
    బొబ్బిలి మండలం డొంగురువలస గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో బొడ్డవలస లైన్ ద్వారా సరఫరా జరిగేది. చిన్నపాటి గాలులకే విద్యుత్ నిలిచిపోయేది. ఈ సమస్యను స్థానిక నాయకుడు కేశవరావు ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడి బొబ్బిలి గ్రోత్ సెంటర్ లైన్ ద్వారా సరఫరా కల్పించారు. దీంతో గిరిజనులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు....
    153 Views
  • 14న భోగాపురానికి YS జగన్ రాక
    మాజీ CM YS జగన్ ఈ నెల 14న భోగాపురం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.30 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సన్దే విలేజ్ రిసార్ట్కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు YCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. #RAJESH 
    164 Views
  • రాయితీపై ధరణి బియ్యం విక్రయాలు
    ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు జిల్లాలోని నిర్దేశిత రైతుబజార్లలో అక్టోబర్ 12 నుంచి రాయితీపై ధరణి బ్రాండ్ బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. కేఎన్ఎం, బీపీటీ రకాల బియ్యాన్ని రైతుబజార్లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. #RAJESH
    299 Views
  • నెల్లిమర్ల బీసీ మహిళకు.. సాలూరు, పార్వతీపురం అన్ రిజర్వ్డ్
    విజయనగరం, మన్యం జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. విజయనగరం కార్పొరేషన్ జనరల్ మహిళ, నెల్లిమర్ల బీసీ మహిళ, పాలకొండ, రాజాం, బొబ్బిలి జనరల్ మహిళలకు కేటాయించినట్లు సమాచారం. ఇక సాలూరు, పార్వతీపురం అన్ రిజర్వ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల వివరాలను అధికారులు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. #RAJESH
    184 Views
  • కూటమికి రెండేళ్లే డెడ్లైన్: బొత్స
    రానున్న స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల విజయానికి పని చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. బాడంగి మండల కేంద్రంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో YCP గెలుపునకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. పార్టీకి పని చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. YCP కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. #RAJESH
    202 Views
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి
    బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో సమస్యలు ఎదురైనా బీసీలకు న్యాయం చేసేందుకు అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. #RAJESH 
    172 Views
More Results