Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
    బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. టాపర్‌గా నిలిచిన వారికి HM శాంతి కుమారి విమాన ప్రయాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, టాపర్‌లుగా నిలిచిన చందన, వరుణ్‌లను తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లినట్లు MEO రెడ్డిశేఖర్ తెలిపారు. ఈ సంఘటన విద్యార్థులలో స్ఫూర్తి నింపింది.
    222 Views
  • నిమ్మనపల్లి: జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి-జేసీ.
    బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, భూగర్భ జలాల సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిని సమీక్షించి, వర్షాకాలాన్ని దృష్టిలో...
    170 Views
  • మహానాడులో కట్టా దొరస్వామి నాయుడు: పార్టీ బలోపేతంపై పిలుపు.
    మొలకలచెరువులోని KGN ఫంక్షన్ హాల్లో బుధవారం మహానాడు మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, "మహానాడు పార్టీకి మార్గదర్శక వేదిక. ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి" అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    231 Views
  • బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి.
    పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని, మదనపల్లె నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని, మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు దోహదపడాలని...
    277 Views
  • మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.
    మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం వారణాసిపల్లికి చెందిన ఆయన వీపుపై గడ్డ రావడంతో చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రిలో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ వికటించి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆగ్రహం...
    215 Views
  • రామసముద్రం: కొత్తిమీర మూట జారిపడి మహిళ చెవి తెగిన వైనం.
    బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మంజుల (40) అనే మహిళ చెవి తెగి తీవ్ర రక్తస్రావమైంది. నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోయడానికి వచ్చిన ఆమె, తోటలో కోసిన కొత్తిమీర మూటలను వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మూట చెవిపై పడింది. తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    197 Views
  • నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్.
      నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్స్. AP Weather Update IMD Issues Rain Alert for Andhra Pradesh వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఎండలతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో...
    218 Views
  • స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.
    కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పీఏగా వర్షిణి నియామకం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన అన్న వర్షిణి తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్షిణి, కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు...
    206 Views
  • ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.
    ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు మూడు తరాలుగా ఆయనపై గౌరవం తగ్గలేదన్న నారా భువనేశ్వరి తెలుగుజాతి కీర్తి ఎన్టీఆరేనని స్మరించుకున్న మంత్రి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులు...
    209 Views
  • వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్.
    బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం సర్వదర్శనానికి 12 గంటల సమయం కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు  తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 89,403 మంది భక్తులు స్వామివారిని...
    203 Views