కరీంనగర్ జిల్లా.
సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు...
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు గురువారం నమోదు చేశారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ప్రజలతో చీటీలు కట్టించుకుని, సేకరించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మోసం...
మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు అక్రమంగా సారా తయారీ, విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సారా అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల దుర్వింత్ రామ్ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు ఆడుకుంటున్న వీరిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్కను పట్టుకోవాలని, నియంత్రించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. గాయపడిన పిల్లలకు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు పంచాయతీ, 34, 35 వార్డుల నాయకులు రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో "గ్రహణం వీడింది" అంటూ సంబరాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, సెల్ఫీలు తీసుకుని #ఏపీ థాంక్స్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ సూచించారని నాయకులు తెలిపారు. ఈ సంబరాలు అమరావతికి...
మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో శుక్రవారం మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. ఈ సందర్భంగా 18వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు సమాచారం.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా...
చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం లభించిన శుభ సందర్భంలో గ్రామ సచివాలయం వద్ద దీపాలు వెలిగించి రాజధాని అమరావతికి దీప హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, వెంకటేశ్వర్లు,యువ నాయకులు కొండేపి దుర్గాప్రసాద్,సచివాలయ...
మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ వర్ణమైన మరి మనుషులుగా పుట్టి మరణిస్తామని తెలిసి మీరు ఆచరిస్తారా?