*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*అంగన్వాడి కార్యకర్తలతో....ముఖాముఖిగా సమావేశమైన ఎమ్మెల్యే*
*తమ సమస్యలను ఎమ్మెల్యే రాముకు వివరించిన... అంగన్వాడి కార్యకర్తలు*
*అంగన్వాడీ సోదరీమణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే రాము*
*అంగన్వాడి సోదరీమణులకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం:ఎమ్మెల్యే...
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*
*పత్రికా ప్రకటన* *ది.09.03.2026.*
*🔴ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా టి.షర్ట్ లను ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.*
*🔴 ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ సంవత్సరం మార్చ్ 12 వ తేదీన ఆంద్రప్రదేశ్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వారి ఆద్వర్యంలో మన ఆరోగ్యం మన భూమి రెండూ మన...
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై భీకరంగా కొట్టుకున్నారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణలో పలువురికి రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఆక్షన్ లేకుండా నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పద్ధతి వల్ల రైతులు, వ్యాపారులు ఎవరూ నష్టపోరని, రైతులు ఆర్థికంగా లాభపడాలని ఎమ్మెల్యే సూచించారు.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుండి 306 అర్జీలను స్వీకరించారు. వితంతు, వికలాంగుల పింఛన్లు, భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన...
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె ఆర్‌ఆర్ స్ట్రీట్‌లో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు, డ్రెస్సు కొనుగోలు చేసి మార్చుకునే విషయంలో న్యూ కళామందిర్ సిబ్బందితో మాటామాటా పెరగడంతో వారు దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు. దాడిలో గాయపడిన నజీరా ను బంధువులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స...
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై అనుచితంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారితో కూడా బూతులు మాట్లాడాడు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొని బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, సైబర్ నేరాలు, మహిళల వేధింపులపై అందిన వినతులను పరిశీలించి, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, బాధితులకు న్యాయం జరిగే వరకు బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ చిరంజీవి ఫిర్యాదు మేరకు తాలూకా సిఐ వెంకటరమణ విచారణ చేపట్టారు. సిండికేటుగా ఏర్పడి నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో లారెన్స్, అనిస్ మోసెస్, నెల్సన్, రతీశ్, వినీల్, జశ్వంత్ జాన్, దినేన్‌లపై కేసు ఫైల్ చేశారు.