Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
    ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులు..తమ అసలు బాధ్యతను విస్మరించి సైడ్ బిజినెస్లలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండో ఆదాయంపై మక్కువతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
    717 Views
  • ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
    విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆటవిడుపు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీ గ్రీస్మ, తదితరులు సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి చేనేత శారీలు ధరించి సభ వేదికపైకి వచ్చారు. #Boiena Rajesh
    370 Views
  • ప్రజా దర్బార్'కు విశేష స్పందన
    బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభించింది. 25వ వార్డులో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ద్వారాకనగర్ ప్రజలు రైల్వే క్వార్టర్స్ మీదుగా రాకపోకలకు దారి ఇచ్చేలా చూడాలని కౌన్సిలర్ లక్ష్మి, టీడీపీ నాయకులు సత్యనారాయణ కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ సమస్యలపై వినతులు ఇచ్చారు. #Boiena Rajesh
    376 Views
  • పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
    మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెట్ల పనితీరును విద్యార్థులకు వివరించారు. 'శక్తి టీం' మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందని, ఆపదలో ఉన్నవారు భయం వీడి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు. యువత టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, వ్యసనాలకు దూరంగా...
    285 Views
  • ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
    మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. శుక్రవారం, కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, 16 నుండి 22 ఏళ్ల వయస్సు జీవితానికి కీలకమని, ఈ ఆరేళ్లు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా మాయలో పడకుండా, అపరిచితులకు 'నో' చెప్పడం నేర్చుకోవాలని, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులను...
    257 Views
  • అన్నమయ్య: పోలీసుల స్పెషల్ వీడియో.
    అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, సమాజంలో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పాఠశాల బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ఈ వీడియోను...
    294 Views
  • మదనపల్లె బస్టాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పర్సు చోరీ.
    మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం చిత్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖదీర్ పర్సును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. అందులో రూ. 12,000 నగదు, ఆధార్ కార్డు ఉన్నాయని బాధితుడు ఫిర్యాదు చేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మహమ్మద్ రఫీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
    304 Views
  • మదనపల్లెలో వృద్ధురాలి స్థలం కబ్జా.. అండగా నిలిచిన పోలీసులు.
    మదనపల్లెలోని సురభికాలనీలో నివసించే చెంగమ్మ అనే వృద్ధురాలి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నించగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అనాథ అని చులకనగా చూస్తే ఊరుకోబోమని, కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    314 Views
  • మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
    మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కమ్మగడ్డ వీధిలో సారా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో, రెండో పట్టణ ఎస్సై నాగేశ్వరావు దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యానికి వ్యతిరేకంగా నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.
    299 Views