మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 267 మందికి ఈ కార్డులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి కూడా అర్హతను బట్టి తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంఏసీ...
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించాం.
రాయలసీమ, అనంతపురంలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రిన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్, కడప,...
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 267 మందికి ఈ కార్డులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి కూడా అర్హతను బట్టి తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంఏసీ...
మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య, మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గంగమ్మ గుడి వద్ద స్పీడ్ బ్రేకర్ పై బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతం సమీపంలో వాహనదారులు...
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేలా భద్రత కల్పించారు. బుధవారం ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్న అధికారులు
రూ. 300 టికెట్ ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వెల్లడి
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25...
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. క్లాసులో టాపర్‌గా ఉన్న ఆమె క్యాంపస్ సెలక్షన్లలో ఇన్ఫోసిస్‌లో 17 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, సోమవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావన మృతితో మంగళవారం మంగళం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.