Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
    శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్ పోలో కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదాం (19) ను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు# కొత్తూరు మురళి.
    306 Views
  • పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
    పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నోటీసును మున్సిపల్ మేనేజర్‌కు అందజేశారు. ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దినసరి పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి...
    323 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
    పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గోవిందప్ప, మోహన్ బాబులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3400 విలువైన 17 నిషేధిత లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏ.ఎస్సై అశ్వత్థ నారాయణ తెలిపారు. నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు# కొత్తూరు మురళి.
    296 Views
  • పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
    పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. వాతావరణంలో తీవ్రమైన మార్పుల నేపథ్యంలో వైద్యాధికారులు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
    279 Views
  • పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు
    చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు ప్రారంభించారు. హంద్రీనీవా కాలువ ద్వారా పుణ్యమ్మ చెరువుకు జలాలు చేరుతున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో 50 రాళ్ల మరవ కూడా వెళ్లనుందని గ్రామస్తులు తెలిపారు. చెరువులో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, మరవ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యమ్మ చెరువు నిండితే పరిసర ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని...
    298 Views
  • మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
    మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ తరగతికి 729 మంది నమోదవ్వగా, 530 మంది హాజరయ్యారు. 4వ తరగతికి 528 మంది నమోదు కాగా, 370 మంది పరీక్ష రాశారు. 11వ తరగతి పరీక్షలు స్థానిక జడ్పీ హై స్కూల్‌లో, 4వ తరగతి పరీక్షలు మున్సిపల్ హోప్ హై స్కూల్, జవహర్ నవోదయ పాఠశాలలో నిర్వహించబడ్డాయి.
    323 Views
  • మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
    మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన వివాదం కర్రల దాడికి దారితీసింది. రాజీవ్ నగర్ నివాసితులైన వీరి మధ్య ఇంటి స్థలాల వాటాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మాటామాటా పెరిగి ఘర్షణకు దిగడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు...
    305 Views
  • అన్నమయ్య జిల్లా: 2 డిపో గౌరవ అధ్యక్షుడిగా దేవేంద్రబాబు ఎన్నిక.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మున్న (తారక్) చిన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి, శాలువా, పుష్పగుచ్ఛాలతో దేవేంద్రబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డిపో అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ఆయన నాయకత్వం బలంగా నిలుస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో...
    305 Views
  • మదనపల్లె పోలీసులు అన్యాయంగా కొట్టారు – వెంకటరమణ ఆరోపణ.
    మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన వెంకటరమణ శనివారం ఆరోపించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉండటంతో చికిత్స చేయిస్తున్నామని, సొంత ఊరిలో ఇరుగుపొరుగు వారితో గొడవల కారణంగా వేరే ఊరికి మారినా, తిరిగి వచ్చాక కూడా గొడవలు కొనసాగాయని తెలిపారు. భార్య ఫిర్యాదుతో స్టేషన్‌కు తీసుకెళ్లి వేళ్లు విరిగేలా కొట్టారని ఆయన ఆరోపించారు. ఘటనపై న్యాయం చేయాలని...
    304 Views
  • సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.
    అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లో ఆదివారం బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. వారం రోజులుగా మూడు కోళ్ల ఫారాల్లో దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందాయి. మిగిలిన కోళ్లను ఊరి బయట గుంతలు తవ్వి పూడ్చివేస్తున్నారు. మూడు ఫారాలను అధికారులు సీజ్ చేశారు.
    329 Views