తెనాలి కార్తీక మాసంలో ఈరోజు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ పరిసర గ్రామాలలో భక్తుల సందడి నెలకొంది శుక్రవారం తెల్లవారుజాము నుంచే వైకుంఠ దేవస్థానం తో పాటు గంగానమ్మపేటలోని పాత శివాలయం మారిష్ పేట లోని శివాలయం రామలింగేశ్వరపేటలోని శివాలయం సుల్తానాబాద్ లోని శివాలయం జాగర్లమూడి ప్రాంతాలలోని శివాలయాలు నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు బారులు తీరి నాగదేవతలకు పాలు చలిమిడి సమర్పించి...
తెనాలి మండలంలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2026 నిర్వహణపై అధికారులు దృష్టిసారించారు ఇందులో భాగంగా శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణ సంబంధిత అంశాలపై పార్టీలు నాయకులతో అధికారులు చర్చించారు ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారి దుర్గాబాయి ఎంపీడీవో దీప్తి ఎమ్మార్వో గోపాలకృష్ణ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సినీ పరిశ్రమ అనాధగా మారిందని దానికి అమ్మానాన్న కావాలని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు తెనాలిలో జరిగిన కార్యవర్గ సమావేశం లో మాట్లాడుతూ 1097 ధియేటర్లు ఉన్న ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించాలని కోరారు షూటింగులకు సింగిల్ విండో అనుమతులు స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించాలన్నారు
తెనాలి సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ కు జనరల్ కేటగిరీ వారి 3000 ఎస్సీ, ఎస్టీ బీసీలు 1500 చెల్లించాలి వార్డు సభ్యులు జనరల్ కేటగిరిలో వెయ్యి రూపాయలు ఎస్సీ, ఎస్టీ బీసీలు 500 రూపాయలు చెల్లించాలి మరియు జనాభా పదివేల లోపు పంచాయతీలకు సర్పంచ్ ఖర్చులు రెండున్నర లక్షల గాను వార్డు సభ్యులకు 60,000 గాను పదివేల జనాభా దాటితే వరుసగా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు తొలిదశలో 3967 రెండవ...