Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
    చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్ చాప్టర్‌కు జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీరాలకి చెందిన న్యాయవాది రాజేశ్వరి చేబ్రోలును నియమించారు. ఈ మేరకు ఐ హెచ్ ఆర్ సి జెనీవా భారత జాతీయ అధ్యక్షుడు,అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె. రాజానందన్ విజ్ఞాన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి తో సంప్రదింపుల హోదా కలిగి...
    331 Views
  • పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
    పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసన తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వంలో పాలు లేకుండానే కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డు తయారు చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసిపి పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు#...
    305 Views
  • పుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం
    పుంగనూరు నియోజకవర్గ మండలాలలో మంగళవారం ఉదయం పొగమంచు తీవ్రత పెరిగింది. ఇటీవల వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ప్రయాణాలు కష్టతరంగా మారాయి. వాతావరణంలో రోజుకో రకంగా మారుతున్న మార్పులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి# కొత్తూరు మురళి.  
    342 Views
  • పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి సోమవారం...
    321 Views
  • భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.
    మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య విజయను ఆదివారం రాత్రి కిరాతకంగా కొట్టారు. తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నామని, ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి తనపై శారీరక, మానసిక వేధింపులు కొనసాగుతున్నాయని బాధితురాలు విజయ వాపోయారు. ఇటీవల భర్త సుధాకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి...
    261 Views
  • పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.
    మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో, నాణ్యతతో పరిష్కారం చూపాలని, అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో...
    306 Views
  • కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
    మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. హైకోర్టు కేసు కొనసాగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు జరుగుతున్నాయని, అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణమే విచారణ చేసి...
    592 Views
  • గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
    సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ పాటలు, రికార్డింగ్ డాన్సులు, వివాదాస్పద వ్యాఖ్యలకు అనుమతి లేదని, భక్తులు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, గొడవలు చేసినా కఠిన చర్యలు...
    301 Views
  • వృద్ధ దంపతుల ఇంటిని కూల్చేశారు – న్యాయం కోసం ఫిర్యాదు.
    మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ, శానిటోరియం సమీపంలోని తురకపల్లెకు చెందిన గఫూర్ ఖాన్, బుడాన్ భీ దంపతులకు ముగ్గురు కుమారులు ఖాదరవల్లి, సైఫుల్లా, జాఫర్ వల్లీలు ఉన్నారు. వంశపారంపర్యంగా పాడి ఆవులను మేపి పాలు విక్రయిస్తూ బాగా స్థిరపడినప్పటికీ, తల్లిదండ్రుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేసి, వారం రోజుల క్రితం జెసిబి ద్వారా ఇంటిని కూల్చివేశారు. ఈ దాడులు, భయభ్రాంతులకు గురి చేసిన కొడుకులపై చర్యలు...
    273 Views
  • సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.
    సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరుతూ సోమవారం మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీవారి లడ్డూ అంశంపై నివేదిక ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీకి వ్యతిరేక ఫ్లెక్సీలపై ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే...
    288 Views