Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు ఈవెంట్లకు ఎంపికైన నాగజ్యోతి
అనకాపల్లి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు సంబంధించి అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పీవీఎం నాగజ్యోతి సత్తా చాటారు.
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఏకంగా నాలుగు ఈవెంట్లలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో ఆమె నాలుగు విభాగాల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.135 Views -
-
నందిపేట్లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం
40 ఏళ్ల నిరీక్షణకు తెర.. నందిపేట్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం
నందిపేట్ గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి ఎట్టకేలకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1986 ఆగస్టు 27 నుంచి 40 సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి సొంత భవనం నిర్మాణం చేపట్టడంతో గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి.
ఇన్నాళ్లుగా చిన్న అద్దె భవనంలో గ్రంథాలయం కొనసాగుతుండటంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన వసతులతో కూడిన నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, వారి నిరీక్షణకు ఇప్పటివరకు ముగింపు లభించలేదు.
తాజాగా నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. నూతన భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలగడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.51 Views -
-