రామంతాపూర్‌లో రోడ్డు పనులు నత్తనడకన.. మూడు నెలలుగా ప్రజలకు తప్పని ఇబ్బందులు
రోడ్డు–డ్రైనేజీ పనులతో ట్రాఫిక్ అవస్థలు | పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఆలస్యం
మల్లాపూర్ దర్గాలో గ్యారవీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మైనారిటీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్యారవీ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు...
హైదరాబాద్: సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు జాతీయ రహదారి (NH-44)పై చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2024 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు.....
ఏపీలో పరిశ్రమలు ఏర్పాటుకు పెట్టుబడిదారుల ఆకర్షించేందుకు ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య ముంబైలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించాయి. ఈ షోలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటుకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక వసతులపై పారిశ్రామికవేత్తలకు మంత్రి వివరించారు. నవంబరు 12,13 తేదీల్లో విశాఖలో సదస్సు ఉందన్నారు.
#RAJESH
ఎస్.కోట మండలంలోని తెన్నుబొడ్డవర బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మాస్టర్‌గా పనిచేసిన బొమ్మారెడ్డిపల్లి ప్రసాద్.. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అరెస్టైనట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. మంత్లీ డిపాజిట్ల పేరుతో నగదు సేకరించిన ఆయన, ఖాతాలో జమ చేయకుండా నకిలీ పాస్‌బుక్‌లు ఇచ్చి నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించామన్నారు. పోలీసుల విచారణలో నిజాలు బయటపడటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
#RAJESH
మదనపల్లె, సెప్టెంబరు 30:
అక్టోబర్ 2న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మదనపల్లెలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ శ్రీ ఎస్.ఎస్.ఎస్.వి. కృష్ణారావు, డీఎస్పీ శ్రీ కె. శివ పోతురాజు,...
Madanapalle: మదనపల్లె కొత్త ఇండ్లు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వాసవి క్లబ్ మదనపల్లె ఆధ్వర్యంలో ఆరు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని ప్రధానోపాధ్యాయురాలు విష్ణుప్రియ రెడ్డి వాసవి క్లబ్ సభ్యులను కోరగా, క్లబ్ ప్రెసిడెంట్ వీవీ కృష్ణారావు మరియు సభ్యులు స్పందించారు. ఇందులో భాగంగా రూ.12 వేల విలువైన ఆరు...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిషన్ కాంపౌండ్ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్, రాజోలు జనసేన శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, నాయకులు-కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిరివేలు చరణ్ ఆధ్వర్యంలో రాజోలు...
మధ్య ప్రదేశ్‌లో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారిణి ఎస్.జాబిలి ఎంపికైనట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమె ఎంపికయ్యారు. బొబ్బిలి కోటలో గురువారం జాబిలిని ఎమ్మెల్యే బేబినాయన అభినందించి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కోరారు.
#RAJESH