Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులకు వివరించారు.

    ✳️ బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

    ✳️ ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

    ✳️ భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

    ✳️ ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ రావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు, బీర్ల ఐలయ్య గారు, వేముల వీరేశం గారు పాల్గొన్నారు.

    ✳️ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు హాజరయ్యారు.
    234 Views
  • మ్యాపింగ్ కాని ఓటర్లకు త్వరగా నోటీసులు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశం
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లకు, తప్పుల జాబితాలో ఉన్నవారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న అన్ని గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి ఓటర్ల జాబితాను చదివి వినిపించాలని సూచించారు. దీనిపై స్పందించిన జిల్లా అదనపు...
    309 Views
  • బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూపూనార్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రూపూనార్ రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన...
    401 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా GHM-Gr-II, SA, మరియు SGT విభాగాల నుండి అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు...
    400 Views
  • రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో ఈ నెల 20న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భారతి 400 మీటర్ల పరుగు పందెంలోనూ, నిఖిలేష్ షాట్‌పుట్ విభాగంలోనూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత...
    493 Views
  • ఆసిఫాబాద్ పట్టణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    🎤ఆసిఫాబాద్(భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ పట్టణంలోని 16వ వార్డులో సోమవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎం.డి. అహ్మద్, కౌన్సిలర్ దూడల లక్ష్మి గార్లు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కార్డులు రాని వారు...
    449 Views
  • గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
    బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ సీఐ కె.నారాయణరావు తన సిబ్బందితో కలిసి ఆధార్ కార్డులు, ఇళ్లను సోదా చేశారు. గ్రోత్ సెంటర్ లోనే నివాసం ఉంటున్న వలస కార్మికుల వివరాలను పరిశీలించారు.
    181 Views
  • పైడితల్లి అమ్మవారి చరిత్ర తెలుసా?
    ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు గజపతుల వారి ఆడపడుచు పైడిమాంబగా ప్రసిద్ధి. బొబ్బిలి యుద్ధంలో సోదరుడు విజయరామరాజు మరణ వార్తతో ఆమె కన్నుమూశారు. అనంతరం సైనికుడు పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని తెలిపినట్లు చరిత్ర చెబుతోంది. సరస్సులో లభించిన విగ్రహంతో విజయనగరంలో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి అమ్మవారికి నిత్య పూజలు, ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
    190 Views
  • 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేత తప్పదు : సీఎంసీ కమిషనర్‌ సృజన
    75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని ప్రకటించిన సీఎంసీ కమిషనర్‌ సృజన - సాధారణంగా 75 గజాలలోపు ఇళ్లకు అనుమతి అక్కర్లేదని ప్రకటన - సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాల గుర్తింపు ‎ప్రజావాణిలో చాలా ఫిర్యాదులు వచ్చాయని సీఎంసీ కమిషనర్‌ సృజన తెలిపారు. సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించి...
    432 Views
  • బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు
    బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలు 36 వార్డులలో జరగనున్నాయి. 2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ విస్తరించడంతో పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
    184 Views