Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chief Minister Chandrababu Naidu paid floral tributes to the portrait of freedom fighter Tanguturi Prakasam Pantulu on the occasion of his birth anniversary.
    స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu  #AndhraPradesh
    398 Views
  • కంచారం: ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
    రాజాం మండలం కంచరాంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ ఆదివారం నిర్వహించారు. 18 యేళ్లు నిండిన యువత తమ భవిష్యత్తును ఓటు రూపంలో నిర్ణయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. 20 మంది కొత్త ఓటర్లను నమోదు చేసినట్లు వార్డు వెల్ఫేర్ పెంటం నాయుడు తెలిపారు. ఇంకా ఎవరైనా ఓటు హక్కు నమోదుకు చేసుకోకుంటే గ్రామ వార్డు స్వర్ణ గ్రామాన్ని సంప్రదించాలన్నారు.
    199 Views
  • అర్ధరాత్రి నుంచి సమ్మె
    రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్‌, స్కూల్‌ వ్యాన్స్ బంద్‌
    రవాణా రంగ కార్మికల జేఏసీ బంద్‌కు పిలుపు
    ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌

    తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌ కానున్నాయి. రరవావాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా, దాదాపు 18 రవాణా సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని, దీనివల్ల లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్‌ ద్వారా రవాణా సంఘాల నేతలు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. ఆర్‌టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని, ఆటో, ప్రైవేట్‌ రవాణా కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లలో అనుమతులు లేకుండా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలని, గిగ్‌ వర్కర్స్ రక్షణ కోసం ‘అగ్రిగేటర్‌ పాలసీ’ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్ల భారంతో నలిగిపోతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు పాత చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని, నిలిపివేసిన ఆటో త్రీవీలర్‌ లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
    249 Views
  • ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలివే
    గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో విధులు నిర్వహిస్తున్న రమణ.. కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ అశోక్తో పాటు సిబ్బందితో వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది.
    178 Views
  • ఉట్నూర్‌లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజావాణి. ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రకటన
    🎤భారత్  ఆవాజ్,  ఆసిఫాబాద్ ఉట్నూర్: కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉట్నూర్ ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' (సమస్యల పరిష్కార వేదిక) సమయం రేపు మార్చబడింది. ఆగస్టు 24వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (PO) మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.రేపు ఆదివాసీ తుడుందెబ్బ...
    400 Views
  • కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ
    గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది గాయపడటంతో ఎస్పీ దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీని ఓదార్చి ధైర్యం చెప్పారు.
    219 Views
  • పోలీసుల ప్రమాదంపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి
    గాజులరేగలో రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎస్ఐ అశోక్తో పాటు పలువురు సిబ్బంది గాయపడగా, కానిస్టేబుల్ రమణ మృతి చెందడం విషాదకరమన్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ, రమణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
    165 Views
  • ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
    గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్ఐ అశోక్కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రప్రసాద్, కానిస్టేబుల్ రాజబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కానిస్టేబుల్ ఎస్.వెంకటరమణ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
    233 Views
  • వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
    భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది అలాగే బతుకమ్మ ఆటలు నిర్వహించడం జరిగింది  మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని బొడ్రాయికి  నీళ్లు పోసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఈ...
    1K Views
  • వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
    భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది అలాగే బతుకమ్మ ఆటలు నిర్వహించడం జరిగింది  మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని బొడ్రాయికి  నీళ్లు పోసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఈ...
    141 Views