డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్

0
216

బాపట్ల జిల్లా:  కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ క్యాంపు జరుగుతుంది . ఈ ప్రత్యేక శిబిరాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి స్మిత్ కొత్తపాలెం పంచాయతీ సర్పంచ్ పాలపర్తి సంపూర్ణమ్మ మరియు చెరుకూరి పంచాయతీ సర్పంచ్ పాలేటి వీరయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సర విద్యార్థులుతో ఒక వారం పాటు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తామని ఈ సంవత్సరం ఈ గ్రామాలలో ఏంచుకొని ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామాలలో వారం రోజులపాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రతి విద్యార్థి సేవాతప్రత అలవర్చుకోవాలని విద్యార్థులు అందరూ కూడా ఈ వారం రోజులు గ్రామ ప్రజలు రైతులతో కలివిడిగా ఉంటూ వారి వ్యవసాయ అనుబంధ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి తగిన సూచనలు కళాశాల అధ్యాపకులను అడిగి రైతులకు చెప్పాలన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి పాలపర్తి సంపూర్ణమ్మ గారు పాలేటి వీరయ్య గారు మా గ్రామాలను ఎంచుకోవటం చాలా సంతోషకరమని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గ్రామాల్లో స్థితిగతులను తెలుసుకొని మాక్కూడా తెలియజేయాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు శ్రీ కల్లం సింగారెడ్డి గారు శ్రీ కుసుమం వెంకట రెడ్డి గారు కళాశాల సిబ్బంది డాక్టర్ జి రవిబాబు డాక్టర్ కల్లం వెంకట సుబ్బరామిరెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ డి విజయ్ కుమార్ డాక్టర్ ఎన్ అశోక్ కుమార్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్...
By Avunoori Mahesh 2026-06-14 10:31:19 0 220
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 222
Telangana
🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
హైదరాబాద్‌లో  కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా...
By VALLERU SIMHADRI 2026-09-12 11:30:12 0 172
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూడించల భద్రత
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత* ...
By Rajini Kumari 2026-02-06 09:51:36 0 219
Telangana
పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు....
By Sunka Santhosh 2026-04-27 19:14:31 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com