ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం

0
225

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*

 

*ఆరోగ్య ఆంధ్ర దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు..*

- *స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకుందాం*

- *పోలియో అంత‌మొందినా అప్ర‌మ‌త్తంగా ఉందాం*

- *అయిదేళ్లలోపు చిన్నారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పోలియో చుక్క‌లు వేయిద్దాం*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

స‌మ‌ష్టిగా అడుగులు వేస్తూ స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకుందామ‌ని.. ఈ క్ర‌మంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కృషిచేద్దామ‌ని, పోలియో అంత‌మొందినా అప్ర‌మ‌త్తంగా ఉంటూ అయిదేళ్ల‌లోపు చిన్నారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పోలియో చుక్క‌లు వేయిద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

శ‌నివారం విజ‌య‌వాడ‌, ఓల్డ్ జీజీహెచ్ వ‌ద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌ల్స్ పోలియో ర్యాలీని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, రోట‌రీ, ల‌య‌న్స్‌, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియ‌న్ (ఐఎంఏ) త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పోలియోను అంత‌మొందించ‌డం జ‌రిగింద‌ని.. అయితే ముందు జాగ్ర‌త్త‌గా చిన్నారుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన బంగారు భ‌విత‌ను అందించాల‌నే ఉద్దేశంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వం ఇమ్యునైజేష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్, ప్ర‌జా ర‌వాణా, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 611 గ్రామీణ బూత్‌లు, 355 అర్బ‌న్ బూత్‌లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్ర‌త్యేక బృందాలు సేవ‌లందిస్తాయ‌న్నారు. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు త‌దిత‌ర చోట్ల కూడా పాయింట్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఏ ఒక్క‌రూ మిగిలిపోకుండా 100 శాతం ఇమ్యున‌జైషేన్ జ‌రిగేలా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డా. హ‌నుమ‌య్య (ఐఎంఏ), డా. శ్రీదేవి, డా. శ‌ర‌త్ (ఐఏపీ), డా. చిలకపాటి రామ్ చంద్‌, డా. శ్యాం మువ్వ, డా. బోడేపూడి హనుమయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఈనెల 31 వరకు గడువు పెంపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల గడువును మే 31 వరకు...
By Kothuru Murali 2026-05-25 15:47:04 0 104
Andhra Pradesh
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా   *పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*  ...
By Rajini Kumari 2026-01-26 07:47:21 0 230
Andhra Pradesh
పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-04-25 03:44:10 0 126
Karnataka
Water Resource Management and Conservation in Karnataka
Karnataka is strengthening water resource management and conservation efforts to address growing...
By Fathima Safa 2026-06-17 06:38:24 0 157
Andhra Pradesh
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు.
📍గంజాయి సంబంధిత, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసులు....
By John Baji 2026-01-21 13:37:06 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com