Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
187

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-02-16 04:51:31 0 236
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణ పరిధిలో అగ్నిప్రమాదం
పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్ మైదానంలో సోమవారం ఆవుల షెడ్డులో వరిగడ్డి వాములో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-02-10 07:34:28 0 199
Telangana
పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : బండి రమేష్
కూకట్పల్లి 9 ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి...
By Jagadeesh Babu 2026-08-12 17:02:53 0 157
Andhra Pradesh
రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు...
By Pagadala Venkateswar 2026-05-14 06:08:51 0 146
Telangana
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత  5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
By Mittapelli Saketh 2025-12-23 08:26:26 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com