పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం

0
211

SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026

 

*పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం*

_*• ప్రస్తుత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు.*_

_*• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.10,134 కోట్లు కేటాయింపు.*_

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో కేటాయింపు. 2009 నుండి 2014 వరకు, రాష్ట్రం సంవత్సరానికి సగటున ₹886 కోట్లు అందుకుంది, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల ఉమ్మడి బడ్జెట్. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపు రూ.10134 కోట్లకు చేరి 11 కు రెట్లకు పెరిగింది. మెరుగైన బడ్జెట్ మద్దతు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడానికి, నూతన ఆస్తుల సృష్టికి మరియు దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రణాళిక వేయడానికి వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన బడ్జెట్ కేటాయింపు సాధారణ నిర్వహణ నుండి స్థిరమైన మరియు లక్ష్య అభివృద్ధి దిశవైపు మారింది. రైల్వే పెట్టుబడి అనుసంధానాన్ని విస్తరించడం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు ప్రయాణీకుల సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

 

2014 తర్వాత బడ్జెట్ కేటాయింపులు మెరుగుపడటం వలన ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరించడానికి ప్రత్యక్షంగా దోహదపడి 1700 కిలోమీటర్లకు చేరుకుంది. మెరుగైన నిధులు మరిన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించడానికి సహాయపడ్డాయి. పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యవసాయ కార్యకలాపాలలో వృద్ధి మరియు ప్రాంతీయ అభివృద్ధికి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిలో విద్యుదీకరణ ఒక ప్రధాన ప్రాధాన్యతా రంగంగా అవతరించింది. 2014 నుండి 1,949 కిలోమీటర్ల రైలు మార్గాలకు విద్యుదీకరణ చేయడంతో, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 100 శాతం విద్యుదీకరణను సాధించింది. ఈ పరివర్తన ఇంధన వ్యయాలను తగ్గించింది, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది మరియు శుభ్రమైన మరియు పర్యావరణ హిత రైలు కార్యకలాపాలకు మద్దతు ఇచ్చింది.

 

స్టేషన్ పునరాభివృద్ధికి కేంద్రీకృత బడ్జెట్ మద్దతు ద్వారా ప్రయాణీకుల కేంద్రీకృత అభివృద్ధి బలోపేతం చేయబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 73 స్టేషన్లను అమృత్ స్టేషన్ పథకం కింద రూ. 3,418 కోట్ల గణనీయమైన పెట్టుబడితో పునరాభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు దశలవారీగా జరుగుతున్నాయి. బడ్జెట్ మద్దతు వలన టెండర్ ఖరారును,నిర్మాణ పనులు మరియు ముగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయడం జరుగుతుంది.

 

    అధునాతన రక్షణ వ్యవస్థలలో పెట్టుబడి ద్వారా రైల్వే భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించబడింది. ఆంధ్రప్రదేశ్‌లో, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ - కవచ్ 130 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేయబడింది. ఇంకా 3,137 కిలోమీటర్లకు కవచ్ 4.0 మంజూరు చేయబడింది. అయితే 2,507 కిలోమీటర్లకు సంబందించిన పనులు లేదా టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ చర్యలు భద్రతా ప్రమాణాలను గణనీయంగా బలోపేతం చేస్తాయి మరియు ప్రమాదాల నివారణకు మరియు తగ్గడానికి సహాయపడతాయి.

 

8 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను 16 జిల్లాలలో గుండా ప్రయాణిస్తూ 23 స్టాప్ లతో ప్రవేశపెట్టడంతో ఆధునిక రైలు సేవలు ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణాన్ని మరింతగా మార్చాయి. ఈ సేవలు వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికంగా అధునాతన ప్రయాణాన్ని అందిస్తూ కీలక గమ్యస్థానాలకు అనుసంధానాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెరుగైన రైలు అనుసంధానం పర్యాటకానికి కూడా ప్రోత్సాహనిస్తూ తిరుపతి వంటి ప్రముఖ తీర్థయాత్ర మరియు సాంస్కృతిక కేంద్రాలకు ప్రయాణంతో సహా, భక్తులు మరియు పర్యాటకులకు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాలను మరియు 30 స్టేషన్లను కలుపుతూ 8 జతల అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కార్యకలాపాలతో దూర ప్రయాణం మరింత సులభతరం చేసింది .మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సేవ, ఛార్జీలను అందుబాటులో ఉంచుతూనే అనుసంధానాన్నీ మెరుగు పరుస్తూ రైలు ప్రయాణం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. 2014 నుండి దాదాపు 805 ఫ్లైఓవర్లు మరియు అండర్‌పాస్‌లు నిర్మించబడ్డాయి, రైల్వే క్రాసింగ్‌లను గణనీయంగా తగ్గించాయి మరియు రైలు ప్రయాణీకులు మరియు రోడ్డు వినియోగదారులకు భద్రతను మెరుగుపరిచాయి.

 

రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులతో పాటు, రాష్ట్రం తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాజధానులను అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తాయి తద్వారా విద్య, సంస్కృతి మరియు వాణిజ్యాన్ని పంచుకోవడంతో పాటు ఈ ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది. ప్రధాన ప్రాజెక్టులలో పెట్టుబడులపై నిరంతర దృష్టి పెట్టడం వలన రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల వృద్ధికి మరియు మెరుగైన అనుసంధానానికి రైల్వే బడ్జెట్ పురోగతి వైపు అడుగులు వేస్తూ ముందుకు నడిపించే కీలకమైన శక్తిగా ఉంటుందని స్పష్టంచేస్తుంది.

Search
Categories
Read More
SURAKSHA
ఒత్తిడిని జయించేలా: ఏపీ పోలీసుల సరికొత్త అడుగు
Content: నిరంతర డ్యూటీలు, కఠినమైన సవాళ్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది మానసిక...
By Kalaga Sailaja 2026-06-25 09:14:52 0 214
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 285
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 165
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 221
Chandigarh
Pharmacy Strike: Nationwide Shutdown Hits Tricity Stores
Medicines are facing a temporary squeeze today as pharmacies across Chandigarh join a 24-hour...
By Dunna Jessicaruth 2026-05-20 09:09:35 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com