Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.

0
371

Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు

06-02-2026 Fri 17:41 | Andhra

 

Chandrababu Naidu Counters YS Jagans Rallies

బలప్రదర్శన కాదు.. అభివృద్ధి ముఖ్యమన్న చంద్రబాబు

రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చి చూపిస్తామని వెల్లడి

గత ప్రభుత్వంలో పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని విమర్శ

కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయించారని ఆరోపణ

భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ

వైసీపీ అధినేత జగన్ పరామర్శ యాత్రలపై సీఎం చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. పరామర్శల పేరుతో గంటల తరబడి ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టడం, బలప్రదర్శనలతో రౌడీయిజం చేయడం వంటి రాజకీయాలు తన దగ్గర చెల్లవని, ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం రాజకీయం కోసం బలప్రదర్శనలు చేయడం సరికాదని, ఎన్నికల సమయంలో సత్తా చాటాలని ఆయన హితవు పలికారు. గతంలో కాన్వాయ్‌తో ఒకరి మరణానికి కారణమవ్వడం, బంగారుపాళ్యంలో మామిడి రైతుల కాయలను తొక్కించడం వంటి చర్యలు వారి రౌడీయిజానికి నిదర్శనమని విమర్శించారు. 

 

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

 

గత ఐదేళ్ల పాలనలో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను దెబ్బతీసేలా కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేశారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. బాత్రూంలు శుభ్రపరిచే రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యితో లడ్డూలు చేయించారని, దీనిపై సీబీఐ, సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తాము ఇప్పుడు ఆ తప్పును సరిదిద్ది, నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.

 

ఒకవైపు ప్రతిపక్ష రాజకీయ శైలిపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వివరించారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని, ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఈ ప్రాంతం నుంచే వస్తున్నాయని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సౌకర్యాలతో సీమకు నీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తాను రాయలసీమ బిడ్డనని, ఎన్టీఆర్ కూడా ఈ ప్రాంత ముద్దుబిడ్డేనని గుర్తుచేశారు.

 

గత పాలకులు పోలవరాన్ని గోదాట్లో ముంచేశారని, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి రూ.400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇప్పుడు తాము అదనంగా రూ.1000 కోట్లతో డయాఫ్రామ్ వాల్‌ను పునర్నిర్మిస్తున్నామని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించిన దూరదృష్టి తమదని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-13 14:54:14 0 222
Telangana
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
By Mittapelli Saketh 2026-02-17 10:12:47 0 521
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి...
By Gadiyapudi Narendra 2026-02-21 16:33:05 0 222
SURAKSHA
​. Digitized Attendance and Strict Punctuality
o improve transparency and accountability in administration, the Karnataka Police has implemented...
By Kalaga Sailaja 2026-06-29 09:11:58 0 174
Telangana
నిజామాబాద్
డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్...
By Sadaq Sadaq 2026-07-29 06:59:27 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com