తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక

0
182

*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*

 

* జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక

* కల్తీ నెయ్యి వ్యవహారం బట్టబయలవ్వడంతో వైసీపీలో వణుకు

* ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్న జగన్

* తప్పుల మీద తప్పులు చేస్తున్న వైసీపీ నాయకులు, శ్రేణులు

* బూతులు తిడుతూ, రప్పా రప్పా నరుకుతామంటూ పెట్రేగిపోతున్న వైసీపీ గూండాలు

* కాపులకు జగన్ నమ్మకద్రోహం

* 5 ఏళ్లలో కాపులను, బీసీలను పట్టించుకోని అంబటి, జోగి రమేశ్

* కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు

* అసహ్యించుకుంటున్న ప్రజలు

* సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ సస్య శ్యామలం

* సీమకు జగన్ చేసింది శూన్యం

* ఒక్క రిజర్వాయర్ నిర్మించలేదు...

* కాలువను వెడల్పు చేసిందీ లేదు...

* జగన్ చేసిన అన్యాయం నిలదీయండి

* సీమ ప్రాంత వైసీపీ శ్రేణులకు మంత్రి సవిత పిలుపు

 

*పెనుకొండ/శ్రీసత్యసాయి* : మహాప్రసాదం వెంకన్న లడ్డూలో పాలుతో చేసిన నెయ్యి కాకుండా, కల్తీ నెయ్యి కలిసిందనే విషయం బట్టబయలవ్వడంతో వైసీపీలో వణుకు ప్రారంభమైందని, ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి బూతులు తిడుతూ డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారని జగన్ పైనా, ఆ పార్టీ నాయకులపైనా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. కాకిలాగా ఊరూరూ తిరుగుతూ, కాపులను మభ్యబెట్టి, వారి ఓట్లను దండుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు మీద తప్పులు చేసి, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు ఉపయోగిస్తూ వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ కేసులో చట్టం తన పని చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సవిత స్పష్టంచేశారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హిందువులు మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో పాలు తయారు చేసిన నెయ్యి లేదని, ప్రసాదం కల్తీ అయ్యిందని స్వయంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసిందన్నారు. వైసీపీ నాయకుల అవినీతితో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం బట్ట బయలవ్వడంతో వైసీపీ నాయకులు బూతులు తిడుతూ, రప్పా రప్పా నరుకుతామంటూ డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారన్నారు. ఆ కుట్రలో భాగంగానే సీఎం చంద్రబాబునాయుడిని, మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ నాయకులు జోగి రమేష్, అంబటి రాంబాబు దూషించారన్నారు. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంతో ఉంటున్నామని, తమకు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమని మంత్రి సవిత తేల్చిచెప్పారు.

 

*కాపులకు జగన్ తీరని ద్రోహం*

 

2019 ఎన్నికల ముందు కాపులను ఓటు బ్యాంకుగా జగన్ వాడుకున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. కాకిలాగా ఊరూరూ తిరుగుతూ, కాపులకు మేలు చేస్తానంటూ వారి ఓట్లను దండుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. నా బీసీలంటూ బడుగు బలహీన వర్గాలను సైతం ఓటు బ్యాంకుగా వాడుకుని, వారికి తీరని ద్రోహం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరవాత ఎస్సీ, ఎస్టీలపైనా, కాపులపైనా, బీసీలపైనా తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో తప్పు మీద తప్పులు చేసి, ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై, కాపులపై అక్రమ కేసులు బనాయించినప్పుడు గాని, దాడులు చేసినప్పుడు గాని జగన్ ను వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. స్వయం ఉపాధి పథకాల్లేక, ఉద్యోగాల్లేక కాపు, బీసీ యువత రోడ్డున పడ్డప్పుడు జగన్ ఎందుకు నిలదీయలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కులం కార్డులు వాడుకుంటున్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, వైసీపీ నాయకులను చేసి అసహ్యించుకుంటున్నారని మంత్రి సవిత తెలిపారు. 

 

 *వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న జగన్*

 

తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తోందని, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనలో చట్టం తన పని తాను చేసుకోపోతోందని, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. తాము తలుచుకుంటే, ఈ 18 నెలల కాలంలో వైసీపీ నాయకులు బయటకు రాగలిగేవారా...జగన్ పరామర్శలు చేసేవారా..? అని ప్రశ్నించారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకే అందేలా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నామన్నారు. తమకు, తమ ప్రభుత్వానికి కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబును, మంత్రి లోకేశ్ ను, ఆయన తల్లి భువనేశ్వరమ్మను అంబటి, జోగి రమేశ్ సహా ఎందరో వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ఇష్టారాజ్యంగా దూషించే వారన్నారు. ఆనాడే ఇది తప్పు అని జగన్ ను వైసీపీ శ్రేణులు నిలదీయాల్సిందన్నారు. స్వయం జగనే... వైసీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నారన్నారు. బూతులు తిట్టాలని, రప్పా రప్పా నరుకుతామని బెదిరించాలని రెచ్చగొడుతున్నారని జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

*సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ సస్య శ్యామలం*

 

రాయలసీమను సస్య శ్యామలం చేయాలని అన్న ఎన్టీఆర్ సంకల్పిస్తే, ఆయన ఆశయ సాధనకు సీఎం చంద్రబాబునాయుడు నడుం బిగించారని మంత్రి సవిత తెలిపారు. 2014-19 మధ్య రాయలసీ సాగునీటి ప్రాజెక్టుల కోసం సీఎం చంద్రబాబునాయుడు రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత 19 నెలల కాలంలో రూ.8 వేల కోట్లకుపైగా వెచ్చించామన్నారు. నేడు రాయలసీమలో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు. శ్రీకృష్ణదేవరాయులు తవ్వించిన చెరువుల్లో నీటిని నింపిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక, చలో పోతిరెడ్డిపాడు అంటూ వైసీపీ మరో డ్రామాకు తెరతీసిందని మంత్రి సవిత విమర్శించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్...రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. ఒక్క రిజర్వాయర్ కాని, ఒక కాలువను కాని నిర్మించలేదనిచ ఆయన రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. ఇదే విషయమై జగన్ ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని మంత్రి సవి పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 182
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2025-12-18 08:21:14 0 252
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Infrastructure and Expressways
Madhya Pradesh continues to expand its infrastructure network through major expressway, highway,...
By Fathima Safa 2026-06-30 08:49:10 0 143
BMA
TRP Reforms 2025: Fighting Urban Bias in Broadcasting
The Ministry of Information and Broadcasting introduced new TRP guidelines in July 2025,...
By JoinBMA 2026-08-21 09:48:13 0 58
Kerala
Kerala Strengthens Forest and Wildlife Conservation
Kerala continues to enhance forest conservation and wildlife protection in 2026 through...
By Fathima Safa 2026-07-04 13:03:40 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com