ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.

0
608

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవల్ని సులభతరం చేస్తోంది. మొత్తం 25 సేవల్ని ఒక క్లిక్ దూరంలో పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్, మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వారికి అవసరమైన సేవల్ని ఎంచుకుని వివరాలు ఎంటర్ చేస్తే కమిషనర్ లాగిన్‌కు వెళతాయి.. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా సేవలు అందుతాయి. ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్‌ను అప్డేట్ చేసింది.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా, సేవలు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు చాలా సులువుగా ఈ సేవలు పొందొచ్చు.

ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా అందించే సేవలకు సంబంధించి ఒక గడువు కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటి పన్నుకు సంబంధించి 15 రోజులు, ట్రేడ్ లైసెన్స్‌కు 7 రోజులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో పాటు సర్టిపికెట్ జారీకి మూడు రోజుల గడువు ఉంటుంది. ఇలా ఈ పోర్టల్ ద్వారా అందించే 25 రకాల సేవలు ఎన్ని రోజుల్లో అందించాలో క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా సేవలు అందించకపోయినా, ఆలస్యం చేసినా, దరఖాస్తును తిరస్కరించినా సరే దీనికి సంబంధించి కారణాలను దరఖాస్తు చేసుకున్నవారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణం లేకుండా ఆలస్యం చేసినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులతో పాటుగా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తారు.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా పొందే సేవలకు సంబంధించిన ఫీజుల్ని నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజలు పొందే ఈ సేవలకు సంబంధించి ఫీజుల వివరాలను కూడా పోర్టల్‌లో ఉంచారు. ఇంటి ఆస్తి పన్నుకు సంబంధించి స్థలం కొలతలు నమోదు చేయగానే ఫీజుల వివరాలు ఆటోమెటిక్‌గా వస్తాయి. ప్రజలు పురపాలకశాఖ వెబ్‌సైట్‌ cdma.ap.gov.in ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. అక్కడ 'ఫింగర్‌ టిప్స్‌లో మున్సిపల్‌ సేవలు' అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో అందించే పౌర సేవలకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. అక్కడ అవసరమైన సేవపై క్లిక్ చేసి.. నగరం, పట్టణాన్ని సెలక్ట్ చేసి అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు మున్సిపల్ కమిషనర్‌ లాగిన్‌కు వెళతాయి.. ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలి.|
● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● 30 వేల...
By Sidhu Maroju 2026-08-18 09:33:32 0 132
Telangana
మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల...
By Avunoori Mahesh 2026-05-16 07:48:06 0 198
Telangana
గాదె ఇన్నయ్య కు బెయిల్ మంజూరు
మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన...
By CM_ Krishna 2026-01-17 05:31:42 0 649
Andhra Pradesh
అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన
విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో...
By Eslavath RameshNaik 2026-03-06 16:37:27 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com