పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి

0
364

మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యన్. భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. దేవేందర్ రాజ్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్య హక్కు చట్టం అమలు కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానం 2020 ని విరమించుకోవాలని, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను మానుకోవాలని,ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల పనులు అప్పగించకూడదని, కాంట్రాక్టు ఉపాధ్యాయ, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారికి కనీస వేతన స్కేలు అమలు చేయాలని, ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ ను సకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఫిబ్రవరి 5వ తేదీన పార్లమెంటు మార్చ్ కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో నిర్వహించ తలపెట్టినందున వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఉపాధ్యాయులు హాజరవుతారని, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని యన్. భాస్కర్ టి. దేవేందర్ రాజ్ కోరారు.

Like
1
Search
Categories
Read More
Prop News
Central Banks Pause Rates, Sparking a Spring Buying Rush
Following consecutive quarters of stabilizing inflation, major central banks have held benchmark...
By Dunna Jessicaruth 2026-05-20 11:11:22 0 158
SURAKSHA
Wednesday Hero UP Police: Blood Donors Saving Lives
This Wednesday UP police officers led blood donation camps in 15 districts. “Rakt Daan...
By Kalaga Sailaja 2026-07-04 09:51:39 0 106
BMA
Future Media Demands Ethical Innovation
The future of media will be driven by innovation, but technological progress must always be...
By JoinBMA 2026-08-20 09:56:08 0 118
Tamilnadu
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
By Bharat Aawaz 2025-07-17 07:57:40 0 1K
Andhra Pradesh
డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం...
By Ratna Sekhar 2026-02-19 19:55:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com