Nadendla Manohar: ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.

0
231

ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వెల్లడి

యంత్రాంగం రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన రోజే సాయంత్రానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.

 

ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.9,800 కోట్లను 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. తేమ శాతం, జీపీఎస్, రవాణా వంటి సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని పేర్కొన్నారు.

 

రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే, గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీరావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 350
Telangana
ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా...
By Chunarkar Jagadeesh 2026-08-10 18:30:07 0 182
Meghalaya
Meghalaya Strengthens Environment and Biodiversity Efforts
Meghalaya continues to strengthen its position as one of India's richest biodiversity regions...
By Fathima Safa 2026-07-01 10:39:23 0 235
Telangana
కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీగణేష్.|
● ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ మహా ధర్నా ● బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరగని...
By Sidhu Maroju 2026-09-06 07:59:28 0 132
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు
SCROLL   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2026-01-13 16:35:40 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com