Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.

0
275

Andhra

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District

కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత

దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:మైనర్ డ్రైవర్ కారు ఇంటి గోడను ఢీకొట్టింది
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం నక్కబండ ప్రాంతంలో ఇంటి గోడను ఓ కారు ఢీకొట్టింది....
By Kothuru Murali 2026-06-22 10:45:27 0 128
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 322
Sports
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
By Avunoori Mahesh 2026-05-01 08:59:26 0 241
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్  గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 06:24:57 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com