వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

0
213

విజయవాడ

15-01-2025

 

ప్రచురణార్ధం

 

వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

 

కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

 

స్థానిక బ్రాహ్మణ వీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద గురువారం నాడు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, ముగ్గులు, హరిదాసుల కీర్తనల మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగని, ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ఇంటికి వచ్చే ఈ శుభ సమయాన్ని, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తారని అన్నారు. గంగిరెద్దులు మరియు హరిదాసుల వంటి ప్రాచీన తెలుగు సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ సొంత ఊర్లకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు పండుగను జరుపుకోవడం మన సంప్రదాయంలోని గొప్పతనమని, ఈ వేడుకల్లో వారి కుమార్తెలు, అల్లుళ్లు మరియు మనవరాళ్లతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతూ, ప్రతి ఇల్లు సిరిసంపదలతో మరియు సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.
Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-09-17 05:20:23 0 50
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:46:04 0 257
Andhra Pradesh
ఆపరేషన్ వజ్రపుహార్
ఏలూరు జిల్లా  ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని...
By Rajini Kumari 2026-03-07 11:48:24 0 205
Andhra Pradesh
గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.
చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు....
By Gadiyapudi Narendra 2026-03-26 17:20:49 0 558
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
By Pagadala Venkateswar 2026-02-21 04:35:13 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com