స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
Posted 2026-01-12 16:08:44
0
238
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
చీరాల: స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12 నాడు కోల్ కత్తాలో జన్మించి. కేవలం 39 సంవత్సరాల ఆరు నెలలు జీవించారు. అంతతక్కువ వయోపరిమితిలో కూడా అనితర సాధ్యమైన పనులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఒక అద్వైత వేదాంతి తొలిసారిగా పాశ్చాత్య దేశాలను పర్యటించడం... ప్రపంచానికి అంతటికీ భారతీయుల ఔన్నత్యాన్ని చాటిచెప్పడం అనేవి స్వామి వివేకానందలోనే చూడగలం. స్వామి శిష్యులలో పాశ్చాత్యులు సైతం భారతదేశానికి ఎంతో సేవచేశారు.
స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది. వివేకానందుల జయంతి సందర్భంగా ఆయన సందేశాలు జ్ఞాపకం చేసుకొని ఆచరిద్దాం. ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది.
యువతను జాగృతం చేసిన స్వామీ వివేకానంద గారి ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ దేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ, దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ, మరింత బలంగా ముందుకు సాగాలి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు వేణు పిక్కి నారాయణ గుమ్మ వెంకటేష్ బోయిన శీను మంగపతి మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోటల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి - బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ . |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గేటు వద్ద గంటల...
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం...
Free Speech Hit: YouTuber Arrested at Saharanpur Site
In a troubling incident for independent digital media, local police in Saharanpur arrested a...
మచ్చ బొల్లారంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగ.. అల్వాల్ ల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ...
ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి....